రంగస్థలంతో తాను హిట్టు కొడితే ఆ రీ సౌండ్ ఎలా ఉంటుందో చూపించాడు డైరక్టర్ సుకుమార్. ఇక అల వైకుంఠపురములో సినిమాతో తన అసలు సిసలు స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్య, ఆర్య 2 తో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. సుకుమార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీ ఆర్య 3 అవుతుందని అనుకున్నారు కానీ ఈసారి డిఫరెంట్ స్టోరీతో సినిమా చేస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. 

 

సినిమాలో బన్ని లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట. శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథనంతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ శేషాచలం అని పెట్టే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. డైరక్టర్ సుకుమార్ కానీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గాని సినిమా టైటిల్ విషయంలో సస్పెన్స్ మెయింటైన చేయరు. ఆడియెన్స్ కు ముందే టైటిల్ చెప్పేసి సినిమా తీస్తారు. అందుకే బన్ని ఈ సినిమాకు అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. 

 

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కాబట్టి ఆరోజు సినిమా టైటిల్ బన్ని ప్రీ లుక్ ఒకటి రిలీజ్ చేస్తారని అంటున్నారు. సినిమా కోసం బన్ని చిత్తూరు యాసని నేర్చుకుంటున్నాడని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను మరో రంగస్థలం అంతకన్నా పెద్ద హిట్టు బొమ్మ చేయాలనీ సుక్కు ప్లానింగ్ లో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: