వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ సినిమాలెన్ని చేస్తాడో అంతకంటే ఎక్కువ వివాదాలే కొని తెచ్చుకుంటాడు. ఆయన చేసే సినిమాల్లో కంటెంట్ ఉంటుందో ఉండదో వివాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దేశంలో జరుగుతున్న సమకాలీన పరిస్థితుల మీద, వ్యక్తుల మీద సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ సమాజం గురించి తనకి అనవసరం అని చెప్తూ ఉంటాడు. సమాజాన్ని నేను పట్టించుకోనని, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానని చెప్పే వర్మకి సడెన్ గా సమాజం గుర్తొచ్చింది.

 

అవును గత కొన్ని రోజులుగా సమాజం కోసం తెగ కృషి చేస్తున్నాడు. దిశ కేసు జరిగిన తర్వాత ప్రధాన నిందితుడు చెన్నకేశవులు భార్యని ఇంటర్వ్యూ చేయడం దగ్గర నుండి, ఆమెకు సాయంగా డబ్బు అందించడం వరకూ.. ఇంకా ఇప్పుడూ కరోనా వైరస్ పై ఆయన కల్పిస్తున్న అవగాహనని చూస్తుంటే వర్మలో మనకు తెలియని మరో కోణం ఉందని తెలుస్తుంది. కరోనా వైరస్ గురించి మొదట్లో తేలికగా తీసుకున్న వర్మ... మెల్లమెల్లగా అర్థం చేసుకున్నట్టున్నాడు.

 

అందుకే కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నాడు. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కలిసి కరోనా అవగాహన మీద పాటరాసి వినిపిస్తుంటే వర్మ కూడా తన పాట రాసి మరీ పాడాడు. వర్మ గొంతు వినసొంపుగా లేకపోయినప్పటికీ, అక్కడక్కడా నవ్వు తెప్పించినప్పటికీ పాట పాడడంలో వర్మ ఉద్దేశ్యం మాత్రం బాగుంది. ఆ పాటలో చాలా మంచి పాయింట్లనే అడ్రెస్ చేశాడు వర్మ.

 

అనవసర విషయాల గురించి ఇప్పుడు చర్చ పెట్టకుండా ప్రస్తుతం వైరస్ గురించి ఎలా కాపాడుకోవాలా అన్న దానిపైనే దృష్టి పెట్టాలనీ, దానికోసం చేతులు కడుక్కోవాలనీ..పరిశుభ్రత పాటించాలనీ తెలిపాడు. మొత్తానికి సమాజం గురించి తనకి అవసరమే లేదని, తన బతుకు తాను బతుకుతానని చెప్పిన వర్మకి సడెన్ గా సమాజంపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కావట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: