లేటు వ‌య‌స్సులో కూడా త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును  హీటెక్కిస్తోంది అన‌సూయ. జ‌బ‌ర్ద‌స్త్‌తో ఫేమ‌స్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుని ఇప్పుడు బుల్లితెర‌ను ఏలేస్తోంద‌నే చెప్పాలి. ఇక రంగంస్థ‌లం...సొగ్గాడే చిన్నినాయ‌నా..త‌దిత‌ర సినిమాల‌తో వెండితెర‌పైనా వెలిగిపోయింది. హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్ప‌టి అస‌లు విష‌యానికి వ‌స్తే శ్రీరామ న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని అన‌సూయ ప్ర‌త్యేక గెట‌ప్పులో క‌నిపించి అభిమానుల‌ను ఆశ్చ‌ర్య ప‌రిచింది.ఎప్పుడు ఫ్యాషన్ అండ్ ట్రెండీ డ్రెస్సుల్లో కనిపించే అనసూయ ఒక్కసారిగా పాత స్టైల్లోకి మారిపోయింది.

 నిన్నమొన్నటివరకు చిట్టిపొట్టి దుస్తుల్లో... ఫోటోలు దిగిన ఈ భామ.. ఇవాళ మాత్రం సంప్రదాయంగా మెరిసింది. ఎప్పుడు ఫ్యాషన్ అండ్ ట్రెండీ డ్రెస్సుల్లో కనిపించే అనసూయ ఒక్కసారిగా పాత స్టైల్లో లంగా జాకెట్ తొడుగుకొని... ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. లంగా జాకెట్ వేసుకొని సరికొత్త లుక్‌లో జిగేల్ మంది. పూలు కూడా పెట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇవ్వ‌డ‌మే కాదు...ఆ ఫొటోల‌ను అభిమానుల‌తో ట్విట్ట‌ర్‌లో పంచుకుంది. అనసూయ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు అబ్బాబ్బ అన‌సూయ చంపేస్తున్నావు పో అంటూ మెచ్చేసుకుంటున్నారు. నువ్వు దొరసాని అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరికొందరు గార్జియస్ అంటూ మ‌రికొంత‌మంది కితాబిచ్చేశారు. 

 

మరొకరైతే నువ్వు బుట్ట‌బొమ్మ‌వే అంటూ త‌న అభిమానాన్ని ఓ లెవ‌ల్లో చాటేసుకున్నాడు. ఇలా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్న అభిమానుల‌కు అన‌సూయ మాత్రం కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ..అంద‌రికీ   శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పింది. అన్న‌ట్లు సూర్యుడి ముందు ఇలా నా ఫోజు ఎలాఉంది అంటూ త‌న ఫొటోల‌కు కామెంట్ పెట్టింది. సూర్యుడు ఎదుట చందమాట నిల్చున్నట్లు ఉందంటూ కొందరు నెటిజన్లు అనసూయపై ప్రశంసలు కురిపించారు. అన‌సూయ ట్విట్ట‌ర్లో చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. వ్య‌క్తిగ‌త విష‌యాలే కాదు..సామాజిక అంశాల‌పైనా త‌రుచూ త‌న స్పంద‌న‌ను, అభిప్రాయాల్ని పంచుకుంటుంది. ఇటీవ‌ల లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను గుర్తు చేస్తూ ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్‌కు వీడియో పంపిన విష‌యం తెలిసిందే.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: