బన్నీ అంటే అల్లు అర్జున్ సుక్కూ అంటే సుకుమార్. వీరిద్దరి పేర్లూ కూడా పొట్టిగా రెండక్షరాలతోనే బాగా  ముద్దుగా  ఉంటాయి. చిత్రమేంటంటే ఈ ఇద్దరికీ ఎన్నో విచిత్రమైన సెంటిమెంట్లు ఉన్నాయి. పైగా ఇద్దరూ మంచి దోస్తులు, పైగా ఒకరు టాప్ హీరో, మరొకరి సూపర్ డైరెక్టర్. మరి ఈ బలమైన  బంధం  కొనసాగేలా హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు.

 

ఈ ఇద్దరూ మొదట చేసిన ఆర్య మూవీ అప్పట్లో అంటే 2004 లో రికార్డులు తిరగరాసింది. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో ఆ మూవీ మొత్తాన్ని నడిపించి నాటి యూత్ కి సరికొత్త మెసేజ్ ని సుక్కూ అందించాడు. ఇక వన్ సైడ్ లవర్ పాత్రలో అల్లు అర్జున్ పూర్తిగా అతుక్కుపోయాడు. ఆ తరువాత ఆర్య 2 మూవీ చేశారు ఈ కాంబోలో. అది కూడా హిట్టే.

 

ఆ తరువాత మళ్ళీ ఎందుకో కుదరలేదు. ఇన్నాళ్ళకు ఈ జోడీ కలుస్తున్నారు. ఇపుడు రంగస్థలం లాంటి  బ్లాక్ బస్టర్  ఇచ్చిన సుకుమార్ ఉన్నాడు. అలాగే అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ తో అల్లు అర్జున్ జోరు మీద ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా మంచి మూడులో మూడు అంటున్నారు. ఆ మూడవ సినిమా ఎలా ఉంటుందన్న అసక్తి అందరిలోనూ ఉంది.

 

బన్నీ బర్త్ డే ఏప్రిల్ 8. ఆ రోజున హ్యాట్రిక్ మూవీ టైటిల్ ని సుక్కూ రివీల్ చేస్తాడుట. అలాగే పోస్ట‌ర్ కూడా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడ ఈ ఇద్దరి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా రెండు అక్షరాలతోనే టైటిల్ ఉంటుందని అంటున్నారు.

 

ఇప్పటికైతే శేషాచలం అని టైటిల్ ప్రచారంలో ఉంది కానీ రెండు అక్షరాలు కాబట్టి అది పెట్టరనే అంటున్నారు. ఇక ఈ మూవీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించబోతున్నాడు కాబట్టి టైటిల్ కూడా అదిరిపోయే మాస్ ఫ్లావర్ తో ఉండొచ్చని టాలీవుడ్ టాక్. మరో నాలుగు రోజుల్లో ఆ టైటిల్ ఏంటో సుక్కూ చెప్పేస్తాడుగా. వేచి  చూడడమే  బన్నీ ఫ్యాన్స్ పని

 

మరింత సమాచారం తెలుసుకోండి: