గ‌త నెల రోజులుగా క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలం అయిపోతుంది. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డ‌వున్‌లోకి వెళ్ళిపోయారు. ఎవ‌రికి వారు ఇళ్ళ‌కే ప‌రిమితమ‌యిపోయి ఎక్క‌డిక‌క్క‌డ అన్ని మూసివేయ‌బ‌డ్డాయి. ప్ర‌తి వ్యాపారానికి అన్ని రంగాల‌కు ఈ క‌రోనా ఎఫెక్ట్ చాలా గ‌ట్టిగా ప‌డింద‌ని చెప్పాలి. మునుపెన్న‌డూ జ‌ర‌గ‌నంత‌గా ఆర్ధిక‌న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పాలి. క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ప‌డిన‌ట్లే సినీ రంగం మీద కాస్త ఎక్కువ‌గా ప‌డింద‌ని చెప్పాలి. ఎక్క‌డి క‌క్క‌డ పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వ‌ర‌కు షూటింగ్‌ల‌న్నీ ఆగిపోయాయి. ఇక షూటింగ్ పూర్త‌యిపోయి రిలీజ్ రెఢీగా ఉన్న సినిమాలు కూడా విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో మొత్తం సినీరంగం అంతా సైలెంట్ అయిపోయింది. నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు కొన్ని వేల కోట్ల న‌ష్టం వాటిల్లుతుంది. 

 

మ‌రో రెండు నెల‌ల వ‌ర‌కు సినిమా షూటింగ్‌లు ఉండ‌వు.  జూన్ నుంచి షూటింగ్‌లు సినిమా ప్రారంభోత్స‌వాలు మొద‌ల‌యిన‌ప్ప‌టికీ అవ‌న్నీ పూర్త‌యి విడుద‌ల‌కు టైమ్ ప‌డుతుంది. ఇక ఇదిలా ఉంటే... ఒక నాలుగు నెల‌ల త‌ర్వాత అయినా సినిమాలు విడుద‌ల‌యితే థియేట‌ర్‌కి వ‌చ్చి సినిమా చూసే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చి మ‌రీ సినిమాలు చూస్తార‌ని గ్యారెంటీ అయితే లేదు. దీంతో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేట‌ర్ ఓన‌ర్లు బెంబేలెత్తిపోతున్నారు. అన్నిటికంటే అతి పెద్ద ఎంట‌ర్‌టైన్మెంట్ రంగ‌మైన సినీ రంగం ఈ విధంగా కుప్ప‌కూలిపోతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఇది జ‌రిగింది.

 

మ‌రి నిర్మాత‌లు, డిస్ట్రిట్యూట‌ర్లు ఇలా ఉంటే...ఒక సినిమాలో న‌టించ‌డానికి తార‌లు వాళ్ళ వాళ్ళ‌కుండే క్రేజ్‌ని బ‌ట్టి కొన్ని వేల కోట్లు తీసుకుంటున్నారు. మ‌రి ఈ క‌రోనాతో చాలా న‌ష్టం జ‌రిగింది కాబ‌ట్టి పారితోష‌కాలు వాళ్ళు ఏమ‌న్నా త‌గ్గించుకుంటారా...అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు అడ్వాన్స్‌లు తీసుకున్న కొంత మంది హీరోలుగాని, హీరోయిన్లుగాని తిరిగి కొంత వ‌ర‌కు ఇచ్చే ఆలోచ‌న ఏమ‌న్నా ఉందా లేదా అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: