అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సుకుమార్ కాంబినేషన్లో ఇది మూడో చిత్రం కావడం గమనార్హం. అంతేకాదు వీరిద్దరూ కలసి ఆర్యా-2తర్వాత కలసి చేస్తున్న సినిమా. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ బన్నీ కోసం ఎంతో జాగ్రత్తగా రాసుకున్న కథ ఇది. అల్లు అర్జున్ 20వ సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఇప్పుడు చిత్రబృందం సినిమా టైటిల్‌ను ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేసారు.
బన్నీకి సౌత్‌తోపాటు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో అన్ని దక్షిణాదితోపాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే పాన్ ఇండియా సినిమా అయినా కథలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న పాత్ర పేరు కాబట్టి అన్ని భాషల్లో ‘పుష్ప’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారని సమాచారం. ‘పుష్ప’ అనే టైటిల్ కేవలం చిత్తూరు ఏరియాలోనే కాదు తమిళ్లో, మలయాళంలో కూడా ఎక్కువ మందికి ఉంటుందని సుకుమార్ చెబుతున్నారట. అందుకే కాస్త రీసెర్చ్ చేసి, సెర్చ్ చేసి మరీ సుకుమార్ ఈ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేమంటే కథలో త్రీషేడ్స్ ఉంటాయని సమాచారం. ఒకటి ఎర్రచందనం స్మగ్లర్‌గా, రెండోది బిజినెస్ మాన్‌గా, మూడోది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనబడతాడని సమాచారం.
పుష్ప కథ ఇదే అంటూ ఓ కథ అయితే ఇప్పుడు సినీ జనాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమంటే... ఈ సినిమాలో హీరోయిన్ పేరు ‘పుష్ప’ అని, మరికొంత మంది బన్నీ నడిపే లారీ పేరు ‘పుష్ప’ అని, ఇంకొంత మంది ఈ సినిమాలో బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అని చెబుతున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీలో రెండో షేడ్ ఉంటుందట. ఈ కథ ఫారెన్ బ్యాక్ డ్రాప్‌లోకి షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది. అక్కడ బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అని ఉంటుదని తెలుస్తోంది. అక్కడ ఒక స్టైలిష్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తాడట. ఇక మూడో షేడ్‌లో ఇన్వెస్టిగేషన్ లేదా ఒక స్పెషల్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. చూడాలి ఇది నిజమో కాదో...!
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple