బోర్ కొడుతోంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఏం లాక్ డౌనో గానీ.. చేతులు కాళ్లు కట్టేసినట్టుంది. స్వీయ నిర్బంధంలో ఉన్న చాలామంది నోటి వెంట వస్తున్న మాటలివి. ఇలాంటి వాళ్లకు రిలీఫ్ గా.. సినిమా వాళ్లు ఈ కరోనా టైమ్ లో ట్రీట్ ఇస్తున్నారు. నిన్న.. రామ్ చరణ్.. రేపు బన్నీ.. ఎల్లుండి ఎన్టీఆర్. ఇలా ఒక్కొక్కరు ఒకలా సందడి చేస్తున్నారు. 

 

టీవీ ఆన్ చేస్తే చాలు.. కరోనా న్యూసే. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్.. సోషల్ మీడియాలో కరోనా సంగతులే. వీటిని చూసి.. విని విని బోర్ ఫీలైన వాళ్లకు మన స్టార్స్ రిలీఫ్ ఇస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ రివీల్ చేస్తున్నారు. ఈ నెల 8న బన్నీ బర్త్ డే కావడంతో.. ప్రస్తుతం నటిస్తున్న సుకుమార్ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 

 

ఏమబ్బా అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే అల్లు అర్జున్ 20వ సినిమా అప్ డేట్ ఏప్రిల్ 8 ఉదయం 9గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది మైత్ర మూవీస్. ఇందులో శ్లాంగ్ ను బట్టి చూస్తే.. చిత్తూరు యాసలో మాట్లాడటం గ్యారెంటీ. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుంది. బన్నీ లారీ డ్రైవర్ అవతారం ఎత్తుతున్నాడు. 

 

కరోనా హాలిడేస్ ట్రీట్ రామ్ చరణ్ తో మొదలైంది. మార్చి 27న చెర్రీ బర్త్ డే సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ట్రిపుల్ ఆర్ నుంచి భీర్ ఫర్ రామరాజు పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడంతో ఇటు నందమూరి ఫ్యాన్స్.. రామ్ చరణ్ ఫ్యాన్స్  అటు మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: