టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ సొంతం చేసుకుని ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన నటి సమంత రూత్ ప్రభు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు సమంతకు హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన సమంత, ఆ పై సూపర్ స్టార్ మహేష్ తో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన దూకుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన బృందావనం సినిమాల సూపర్ హిట్స్ తో మరింత గొప్ప పేరు ఆర్జించింది.

IHG

ఇక అక్కడి నుండి సమంతకు ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా అవకాశాలు క్యూ కట్టాయి. అనంతరం అనతికాలంలోనే సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఇటీవల తన తొలి సినిమా హీరో అయిన నాగచైతన్య ను వివాహమాడి అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిపోయిన సమంత, వివాహం తరువాత మాత్రం కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే టాలీవుడ్ లో సమంతకు గోల్డెన్ లెగ్ అనే ఒక మంచి పేరుంది. 

IHG

ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు సినిమాలు సక్సెస్ ని అందుకుని ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టడం జరిగింది. ఇక కొన్నాళ్ల క్రితం సమంత చిన్నప్పటి ఫోటో ఒకటి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయి ఆమె ఫ్యాన్స్ ని అలరించచడం జరిగింది. లేలేత బుడిబుడి అడుగులు వేసే ఆ వయసులో చూడడానికి ఆ ఫొటోలో సమంత ఎంతో క్యూట్ గా ఉంది. అయితే మళ్ళి ఇన్నిరోజులు తరువాత సమంత ఫ్యాన్స్ కొందరు దానిని పలు మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేసి, ఒకప్పటి తమ అభిమాన నటీమణి గుర్తులను నెమరువేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఇదే ఫోటో మరింతగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: