బాలయ్య, చిరంజీవి మంచి మిత్రులు అని అందరికీ తెలుసు. వారు కూడా అదే చెబుతూంటారు. బాలయ్య అయితే టాలీవుడ్లో తనకు ఏకైన మిత్రుడు చిరంజీవి అంటారు. ఇక చిరంజీవి కూడా సోదర వాత్సల్యంతో బాలయ్యను చూస్తారు.

 

మరి ఈ ఇద్దరి మధ్య ఎందుకు చిచ్చు ఉంటుంది. ఇద్దరూ ఎందుకు గొడవ పడతారు అనిపించవచ్చు. కానీ ఆ గొడవ వ్యకిగతం కాదు, సినిమాల తెరల మీదనే యుధ్ధం. ఇప్పటికి పదిహేను సార్లు బాలయ్య చిరంజీవి ఢీ కొట్టారు. చివరిగా మూడేళ్ళ క్రితం అంటే 2017 సంక్రాంతి బరిలోకి ఇద్దరూ పందెం కోళ్ళలా ఢీ కొట్టారు.

 

గౌత‌మి పుత్ర శాతకర్ణి మూవీతో బాలయ్య వస్తే చిరంజీవి ఖైది నంబర్ 150 మూవీతో వచ్చారు. రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, ఇపుడు ఈ ఇద్దరూ కూడా మళ్ళీ 2021 ఎన్నికల్లో ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఈ ఇద్దరూ దసరాకే పోటీ పడాలి.

 

అయితే కరోనా వైరస్ మధ్యలోకి రావడంతో సినిమాల షూటింగులు అన్నీ వాయిదా పడ్డాయి. దాంతో ఈ ఇద్దరూ మళ్ళీ ఏ జూన్ నుంచో సినిమా  షూటింగ్ మొదలుపెట్టినా పూర్తి అయ్యేసరికి డిసెంబర్ వచ్చేస్తుంది. దాంతో తమ సినిమాలు సంక్రాంతి  రేసులోకి దింపాలని చూస్తున్నారు.

 

ఎందుకంటే కరోన వైరస్ ఎఫెక్ట్ తో  రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ 2021 సమ్మర్ కి షిఫ్ట్ అవుతోంది. మొదట్లో అనుకున్నట్లుగా సంక్రాంతి 2021 కి ఆ మూవీ రావడం లేదు. దాంతో ఇపుడు సంక్రాంతికి ఈ ఇద్దరు సీనియర్లు కర్చీఫ్ అపుడే వేస్తున్నారు. అదన్న మాట మ్యాటర్.

 

సంక్రాంతి  రేసులోకి చిరంజీవి కొరటాల కాంబోలో ఆచార్య మూవీ వస్తోంది. అదే విధంగా బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీగా అఘోరా వస్తోంది. దాంతో ఈ రెండు మూవీల  మధ్య సంక్రాతి కోడి పుంజుల మాదిరిగా గట్టి యుధ్ధమే జరగనుంది. చూడాలి మరి ఎవరు నెగ్గుతారో, గతంలోలా ఇద్దరూ నెగ్గి సూపర్ అనిపించుకుంటారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: