నాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. సినిమా మీద తనకున్న ప్యాషన్ తో నిర్మాతగా కొత్త వారికి అవకాశం ఇస్తూ కొత్తదనం నిండిన సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఆ ప్రయాత్నంలోనే నాని, ప్రశాంతి కలిసి నిర్మించిన మొదటి సినిమా అ! ప్రేక్షకులను నిజంగానే అ!శ్చర్యపరచింది. సినిమా చూసిన ప్రేక్షకులు నానిని తెగ పొగిడేశారు. ఇక నాని నిర్మాణంలో వచ్చిన సెకండ్ ప్రాజెక్ట్ హిట్. 

 

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి మార్కులే సాధించింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు తీసుకురాలేదు. అంతేకాదు హిట్ సినిమాకు ఇంకా శాటిలైట్ డీల్ కూడా క్లోజ్ కాలేదని తెలుస్తుంది. నాని, ప్రశాంతి హిట్ శాటిలైట్ విషయంలో తగ్గట్లేదని అంటున్నారు. హిట్ సినిమా ఎండింగ్ లో సీక్వల్ ఉంటుందని క్లూ ఇచ్చారు. సినిమా రిలీజ్ టైం లో హిట్ సీక్వల్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. 

 

కానీ నాని ఇప్పుడు హిట్ సీక్వల్ వద్దని అంటున్నాడట. ఒకవేళ హిట్ సీక్వల్ ఉన్నా సరే ఆ సినిమాకు నాని నిర్మాతగా మాత్రం ఉండడం కష్టమని అంటున్నారు. నిర్మాతగా నాని రెండు సినిమాలకే నిర్మాత కష్టం ఏంటన్నది తెలిసింది. అఫ్కోర్స్ నాని డైరక్షన్ డిపార్ట్ మెంట్ నుండి వచ్చాడు కాబట్టి సినిమా ప్రొడక్షన్ గురించి తెలుసు. నిర్మాతగా జేబులో నుండి డబ్బులు తీస్తుంటే ఆ రిస్క్ ఎలాంటిదో ఇప్పుడు బాగా అర్ధమవుతుంది. అందుకే సేఫ్ ప్రాజెక్ట్ లే చేద్దామని ఫిక్స్ అయ్యాడు,

 

హిట్ సూపర్ హిట్ అయితే ఆ సీక్వల్ మీద ప్రేక్షకుల ఆసక్తి ఉండేది.. కానీ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అందుకే సీక్వల్ అవసరం లేదని భావిస్తున్నాడు. అయితే హిట్ డైరక్టర్ శైలేష్ మాత్రం కచ్చితంగా సీక్వల్ చేయాలని అనుకుంటున్నాడట.   

మరింత సమాచారం తెలుసుకోండి: