టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వాస్తవానికి కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా ఎంతో సతమతం అయిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ విజయంతో మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. తన మార్క్ టేకింగ్ తో పాటు అదిరిపోయే మాస్, యాక్షన్ సీన్స్ తో పూరి ఆ సినిమాని అదరగొట్టారు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా తీస్తున్న పూరి, ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఒకేసారి పలు భాషల్లో ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

కాగా ఈ సినిమాని హిందీలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఎంతో భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ జరుగుతోందని అంటున్నారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ కూడా సినిమాలో అదిరిపోతాయని అంటున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పూరి మార్క్ డైలాగ్స్ ని విజయ్ తన స్టైల్ లో ఎంతో అద్భుతం చెప్తున్నారని, ఇకపోతే సినిమాలో హీరో విజయ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు సెకండ్ హాఫ్ లో ఒక భారీ యాక్షన్ ఫైట్, అలానే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ వంటివి మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని చెప్తున్నారు. 

 

ఇప్పటికే సినిమా కోసం కొంత భారీగానే ఖర్చు చేసారని, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన లాకౌట్ ప్రకటించడంతో షూటింగ్స్ బంద్ అయినందు వలన ఈ సినిమా షూటింగ్ ని కూడా ఆపేయడం జరిగింది. లాకౌట్ ముగిసిన అనంతరం రాబోయే మరికొద్దిరోజుల్లో ఈ సినిమాకు సంబంధించి జరుగబోయే తాజా షెడ్యూల్ లో చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేయడం జరుగుతుందని అంటున్నారు. ఇక హీరోయిన్ గా నటిస్తున్న అనన్య పాండే ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకోవడం ఖాయం అని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమే అయితే తొలిసారిగా పూరి, విజయ్ కలిసి చేస్తున్న ఈ ఫైటర్ అద్భుత విజయం దక్కించుకొవడం ఖాయం అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: