ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహికులు తమ ప్రతిభా పాఠవాలతో సత్తా చాటుతున్నారు. సింగింగ్, డ్యాన్స్, సాహస విన్యాసాలు ఒక్కటేమిటి ఎన్నో రంగాల్లో తమ నైపుణ్యాన్ని చూపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.  ఇక టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  టిక్ టాక్ లో కొంత మంది తమ టాలెంట్ ఓ రేంజ్ లో చూపిస్తున్నారు. ఇవి వీక్షించేవారు కూడా ఎక్కువ అయ్యారు.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ టిక్ టాక్ మాయాజాంలో పడిపోయారు.

 

తాజాగా ఓ యువకుడు తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అందరినీ అబ్బురపరిచాడు. ప్ర‌స్తుతం ఓ టిక్ టాక్ వీడియో ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని త‌మ వైపుకి తిప్పుకుంటుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోకి 1.7 ల‌క్ష‌ల వ్యూస్ రాగా, 900వంద‌ల పైగా  కామెంట్స్, ప‌లు షేర్స్ అయ్యాయి. యువ‌రాజ్ సింగ్  అలియాస్ బాబా జాక్స‌న్‌ అనే టిక్ టాక్ స్టార్ త‌న కాళ్ళ‌ల్లో స్ప్రింగ్స్ పెట్టుకున్నాడా అనేలా డ్యాన్స్ చేసి అంద‌రు నోరెళ్ళ పెడుతున్నాడు. గ‌తంలో యువ‌రాజ్ సింగ్‌కి సంబంధించిన‌ చాలా వీడియోస్ ఫుల్ వైర‌ల్ అయ్యాయి. అమితాబ్ బ‌చ్చ‌న్‌, సునీల్ శెట్టి  వంటి స్టార్స్ ఈ యువకుడిని తెగ మెచ్చుకున్నారు.

 

నాలుగు మిలియ‌న్స్‌కి పైగా వ్యూయ‌ర్స్ ని సంపాదించుకున్న యువ‌రాజ్ ముక్కాబులా, కాంటా లాగాతో పాటు ప‌లు బాలీవుడ్ సూప‌ర్ హిట్ సాంగ్స్ కి కాలు క‌దిపాడు. హృతిక్, అమితాబ్, వ‌రుణ్ ధావ‌న్ వంటి స్టార్స్ ఈ కుర్రాడి వీడియోలకు ఫిదా అవుతూ షేర్ చేస్తున్నారంటే మనోడి క్రేజ్ ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుంది. తాజాగా ఈ వీడియోని జెండా పూల్ హిందీ సాంగ్ రూపొందించిన ఇండియ‌న్ రాప‌ర్‌ బాద్‌షా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో 7.7 ల‌క్ష‌ల వ్యూస్, వంద‌ల కొద్ది కామెంట్స్ వ‌చ్చాయి.  

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🔥🔥🔥 @babajackson2019 aag lagaate hue

A post shared by BADSHAH (@badboyshah) on

మరింత సమాచారం తెలుసుకోండి: