ఉదయ్ కిరణ్.. అంత గొప్ప నటుడుని మళ్లీ చూడగలమా? మంచి నటుడుగా ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎంతోమంది ప్రేమను పొందిన ఈ హీరో.. తీసిన ప్రతి సినిమా ఓ సమయం వరుకు హిట్ సొంతం చేసుకున్న వ్యక్తి ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ ఉదయ్ కిరణ్ అప్పట్లో స్టార్ హీరో. 

 

కేవలం సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా స్టార్ హీరోనే.. ఎంత ఎదిగిన పొగరు చూపించకుండా రియల్ హీరో అయ్యాడు. ప్రతి ఒక్కరితో నవ్వుతు మాట్లాడుతూ అందరిలో ఒకడిగా కలిసిపోయేవాడు.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి వచ్చి స్వయంకృషితో అద్భుత నటుడుగా పేరు సంపాదించాడు ఉదయ్ కిరణ్. 

 

ఇకపోతే ఉదయ్ కిరణ్ ఫస్ట్ లవర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ఏంటి అంటే? మనసంతా నువ్వే సినిమా హిట్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ ని ఎందరో ఇంటర్వ్యూ చేశారు అని.. అలానే ఓ జర్నలిస్ట్ కూడా అతన్ని ఇంటర్వ్యూ చేసింది.. అప్పుడే అతనితో ఆమె ప్రేమలో పడింది అని.. 

 

రోజు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ.. ఒకరిని ఒకరు చూసుకోలేనంత దగ్గర అయ్యారు అని.. అయితే మొదట ఆ అమ్మాయి ఉదయ్ కిరణ్ కి ప్రపోజ్ చేసింది అని.. కానీ ఆతర్వాత ఉన్నట్టుండి అతన్ని రిజెక్ట్ చేసింది అని.. ఈ కారణం లేకుండానే ఆమె ఈ పని చేసింది అని ఆ యూట్యూబ్ ఛానల్ గుస గుసలు వినిపిస్తుంది.. అయితే నిజానికి ఇదే విషయం ఉదయ్ కిరణ్ అక్క కూడా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుండి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: