టాలీవుడ్ అగ్ర హీరోల్లో చిరంజీవి బాలకృష్ణ ప్రధానం. ఈ తరం అయినా కిందటి తరం అయినా సరే అగ్ర హీరోలు అంటే వీరి పేర్లే ప్రస్తావనకు వస్తు ఉంటాయి. దానికి కారణం వీళ్ళు చేసిన సినిమాల్లో వీళ్ళకు వచ్చిన మాస్ ఇమేజ్. క్లాస్ ఇమేజ్... చిరంజీవి మాస్ క్లాస్ కి రెండింటికి దగ్గరైతే బాలకృష్ణ మాత్రం క్లాస్ సినిమాలకు కాస్త దూరంగా ఉండే వారు. అయినా ఆయన సినిమాలను వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉండే వారు. ఇద్దరు కూడా భారీ సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే బాలయ్య కంటే చిరంజీవి ఇమేజ్ కాస్త ఎక్కువగా ఉండేది. ఆయన ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉండేవారు. 

 

బాలకృష్ణ ఆచితూచి సినిమాలు చేయడం అందులో ఫ్లాప్స్ ఎక్కువగా ఉండటం తో క్రమంగా బాలకృష్ణ క్రేజ్ అనేది తగ్గుతూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే వీరు ఇద్దరూ కలిసి ఒక సినిమా చెయ్యాలి అనుకున్నట్టు సమాచారం. కృష్ణ వంశీ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసినా సరే ఈ ఇద్దరు ఆసక్తి చూపించినట్టే చూపించి వెనక్కు తగ్గారని అందుకే ఆ సినిమా ఆగిపోయింది అని అంటూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాను తీసుకు రావాలని కృష్ణ వంశీ భావించి అల్లు అరవింద్ తో కూడా మాట్లాడారని అందులో తాను కూడా పెట్టుబడి పెట్టాలి అని భావించారని సమాచారం. 

 

ఆ తర్వాత చిరంజీవి ఆసక్తి చూపించలేదు అని సమాచారం. అందుకే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకుండా ఆగిపోయింది అని అంటూ ఉంటారు. కథ కూడా బాలకృష్ణ కు వినిపించగా ఆయన ఆ సినిమా చేయడానికి ముందుకు వచ్చారని పారితోషికం కూడా మాట్లాడుకున్న తర్వాత వెనక్కు తగ్గారని తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికీ వీళ్ళు చేస్తా అంటే కృష్ణ వంశీ చేయడానికి రెడీ అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: