ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఎంత‌గానో ప్రేమిస్తారు. అన్న‌ద‌మ్ములంటే అమిత‌మైన ప్రేమ‌. అందులోనూ పెద్ద‌న్న‌య్య చిరంజీవి ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ అంటే ప‌వ‌న్‌కు చాలా ఇష్టం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబ‌ర్స్ చ‌ర‌ణ్ అన్నా కూడా చాలా ఇష్టం ప‌వ‌న్ కి. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం చిత్రం మంచి హిట్ అయిన విష‌యం అంద‌రికి తెలిసిందే. అందులో చ‌ర‌ణ్ పాత్ర‌ని బాబాయ్ ప‌వ‌న్ చాలా బాగా మెచ్చుకున్నాడు. చ‌ర‌ణ్ ఆ చిత్రంలో చాలా  అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్‌ని ఇచ్చాడ‌ని.

 

అంత మాస్ క్యారెక్ట‌ర్‌లో చెయ్య‌డం నా వ‌ల్ల అయితే కాద‌ని అన్నారు. ఎప్పుడన్నా నేను అన్న‌య్య వ‌దిన‌ని క‌ల‌వ‌డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన్న‌ప్పుడు చ‌ర‌ణ్ లుక్ చూసేవాడ్ని మాసిపోయిన గ‌డ్డం లుంగీ పంచె క‌ట్టుకుని వ‌చ్చేవాడు. ఏంటి వీడు మ‌రీ ఇలా ఉన్నాడు. ఇంత మాస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు అనుకునేవాడ్ని అన్నారు. సినిమా మొత్తం అలా చేయ‌డానికి ఎందుకంటే నాకంత ధైర్యం లేదు అలాంటి సినిమా చేయ‌డానికి. అంటే పంచెక‌ట్టుకుని చేయాలంటే చాలా ధైర్యం కావాలి. సిగ్గువ‌దిలేయాలి. అంటే చ‌ర‌ణ్ ఎప్పుడూ కూడా ప‌ల్లెటూరులో పెర‌గ‌లేదు. ఎక్క‌డో చెన్నైలో పెరిగాడు. హైద‌రాబాద్‌లో పెరిగాడు.

 

ఇలా ప‌ట్ట‌ణాల్లో పెరిగాడు. అస‌లు అలాంటి ఇత‌నికి ఈ ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఎలా తెలుస్తుదో అనుకునేవాడ్ని ఎప్పుడూ అన్నారు. కాని నాకు తెలిసిన చ‌ర‌ణ్ నేల‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండేవాడు. అంటే ఎంత ఎత్తు ఎదిగిన‌ప్ప‌టికీ చాలా అణిగిమ‌ణిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర నాకు తెలిసి నేను చిన్న‌ప్ప‌టి నుంచి చ‌ర‌ణ్ ని చూస్తున్నాను. అత‌ని గుండెలోతుల్లోని అత‌ని యొక్క స‌హ‌జ‌త్వం ఇది. అలాంటి వ్య‌క్తి చ‌ర‌ణ్‌. అమేజింగ్ పెర్‌ఫార్మ‌ర్ చ‌ర‌ణ్‌. మ‌గ‌ధీర‌లో ఒక‌లాంటి రామ్‌చ‌ర‌ణ్‌ని చూస్తే ఈ చిత్రంలో మ‌రోలా క‌నిపిస్తాడు. నేను ముసుగుత‌న్ని ప‌డుకుంటే రామ్‌చ‌ర‌ణ్ మాత్రం ఉద‌యం నాలుగు గంట‌ల‌కి లేచి రేస్ క్ల‌బ్‌కి వెళ్ళి హార్స్‌రైడింగ్ నేర్చుకునేవాడు. ఎంతో డెడికేష‌న్‌తో ఉండేవాడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: