ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చాలావరకు అన్ని దేశాలు కూడా తమ తమ ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేస్తూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలానే మన దేశాన్ని కూడా వచ్చేనెల 3వరకు లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. దానితో దేశంలోని అన్ని రంగాలు కూడా మూతపడ్డాయి. ఇక సినిమాల షూటింగ్స్ కూడా నిలుపుదల చేయడంతో ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి కూడా బ్రేకులు పడ్డాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొంత వర్క్ ని వర్క్ ఫ్రమ్ రూపంలో చేస్తోందట ఆర్ఆర్ఆర్ టీమ్. 

IHG

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎన్నో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి ఎంతో భారీ స్పందనను రాబట్టడం జరిగింది. ముందుగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో ఒక విషయం గమనిస్తే, రామ్ చరణ్ అగ్నిగా, ఎన్టీఆర్ నీరు గా దూసుకెళ్తుండడం గమనించవచ్చు. అయితే దాని వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని నేడు రాజమౌళి వెల్లడించారు. 

 

రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి అగ్ని వలె జ్వలించే స్వభావం గల వ్యక్తి అని, అలానే భీం నీరు వలె పారే స్వభావం గల వ్యక్తి అని, నిజానికి అగ్ని, నీరు రెండూ కూడా భిన్నమైన స్వభావాలు కలవి, అలానే ఒకదానిని మరొకటి అంతం చేయగలవని, మరి అంత శక్తివంతమైన స్వభావాలు గల ఈ రెండూ కలిస్తే యావత్ ప్రపంచాన్నే ఒక పెద్ద మోటారు మాదిరిగా ముందుకు నడిపించగలవు అనే థీమ్ తో సినిమా సాగుతుందని తెల్పడం జరిగింది. కాగా రాజమౌళి తెలిపిన ఈ విషయాన్ని నిన్న సాయంత్రం ఈ సినిమా నిర్మాతలైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఇది వినగానే ఈ రెండు రకాల స్వభావాలు గల వ్యక్తులను కలిపి, ఏ విధంగా రాజమౌళి సినిమా తీసి ఉంటారో అని మెగా, నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాపై మరింతగా భారీ ఆసక్తిని పెంచుకున్నట్లు తెలుస్తోంది....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: