జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకు రాజమౌళి ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలని తారక్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 20 కోసం కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టారు. అయితే జక్కన్నతో పాటు త్రివిక్రమ్ కూడా తారక్ బర్త్ డేకు ఓ గిఫ్ట్ రెడీ చేస్తున్ాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ సిద్ధం చేస్తున్నాడట పంచ్ మాస్టర్. 

 

రాజమౌౌళి, రామ్ చరణ్ బర్త్ డేకు స్పెషల్ టీజర్ రిలీజ్ చేయడం ఆలస్యం.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా మే 20కోసం ఎదురుచూస్తున్నారు. తారక్ బర్త్ డేకు రాజమౌళి ఏ రేంజ్ టీజర్ రిలీజ్ చేస్తాడో అని ఊహల్లోకి వెళ్తున్నారు. కొమరం భీం పాత్రలో తారక్ ఇలా ఉంటాడు. అలా ఉంటాడు అని స్కెచ్చులేసుకుంటున్నారు. 

 

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ మూవీలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తే.. అడవి బిడ్డల తరఫున పోరాడిన కొమరం భీమ్ పాత్ర చేశాడు తారక్. ఇక మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ట్రిపుల్ ఆర్ స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తాడనే టాక్ వస్తోంది. 

 

తారక్ బర్త్ డేకు త్రివిక్రమ్ కూడా ఓ స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నాడట. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా టైటిల్ ను బర్త్ డే సందర్భంగా ఎనౌన్స్ చేస్తారని టాక్ వస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కు వెళ్లబోతోంది. 

 

ట్రిపుల్ ఆర్ టీజర్ తో పాటు త్రివిక్రమ్ మూవీ టైటిల్ కూడా రివీల్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. మరి అరవింద సమేత సినిమాలో ఫ్యాక్షనిజం వద్దు.. అభివృద్ధి కావాలి అని మెసేజ్ ఇచ్చిన త్రివిక్రమ్, ఇప్పుడు తారక్ తో ఓ పొలిటికల్ థ్రిల్లర్ తీస్తాడనే ప్రచారం సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: