ముందుగా టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన రిలీజ్ అయిన బద్రి సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఫస్ట్ మూవీతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన పూరికి, బద్రి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత జగపతిబాబుతో బాచి సినిమా తీసి పర్వాలేదనిపించారు పూరి. ఆపై మాస్ రాజా రవితేజ హీరోగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి వంటి వరుస సూపర్ హిట్ లతో తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగారు పూరి. ఆ తర్వాత 2006వ సంవత్సరం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన పోకిరి సినిమాతో ఎంతో గొప్ప ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి, ఆ సినిమా ద్వారా భారీగా లాభాలను విపరీతమైన పేరును ఆర్జించారు. 

 

ఆపై అల్లు అర్జున్ హీరోగా ఆయన తెరకెక్కించిన దేశముదురు కూడా సూపర్ హిట్ కొట్టింది. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా అయిన చిరుతకు దర్శకత్వం వహించిన పూరి, ఆ సినిమాతో కూడా విజయాన్ని అందుకున్నారు. అనంతరం ప్రభాస్ తో ఆయన తీసిన బుజ్జిగాడు హిట్ కొట్టగా, ఆ తర్వాత పుర తీసిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక 2012లో మరొకసారి మహేష్ బాబుతో ఆయన తీసిన బిజినెస్ మాన్ సినిమా సూపర్ హిట్ కొట్టి, పూరికి మంచి పేరు తెచ్చిపెట్టనుంది. దాని అనంతరం 2015లో ఎన్టీఆర్ తో పూరి తీసిన టెంపర్ కూడా సూపర్ హిట్ కొట్టగా, ఆపై ఆయన తీసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ ను సాధించలేక పోయాయి. గత ఏడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆయనకు దర్శకుడిగా మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెట్టింది. 

 

ఇక ప్రస్తుతం టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు పూరి, ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. మరొక మూడు రోజుల్లో పూరి జగన్నాథ్ టాలీవుడ్ కి దర్శకుడిగా రంగప్రవేశం చేసి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రేక్షకులు, అభిమానులు ఆయనకు ఇప్పటి నుంచే అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా ఫైటర్ అనంతరం పూరి, మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ తో తన తదుపరి సినిమాని చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో, పూరి విజయ్ ఫైటర్ తో ఎంత మేర సక్సెస్ అందుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: