తాను తీసింది వెండితెర మీద చూసే సినిమా కానీ సెల్ ఫోన్ లో చూసే సినిమా కాదు.. తన సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ కేవలం థియేటర్ ఎక్స్ పీరియన్స్ లోనే చూడాలి. టివి, మొబెయిల్ లో అది కుదరదు.. అంటున్నారు వి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ వి. ఈ మూవీలో నాని నెగటివ్ రోల్ లో నటించాడని తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ టైం మే 3 వరకు పొడిగించారు కాబట్టి నాని వి సినిమా ఓటిటిలో వస్తుందని అంటున్నారు కొందరు ప్రేక్షకులు. 


అయితే దీనిపై స్పందించిన వి డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ తానూ సిల్వర్ స్క్రీన్ పై చూసే సినిమా తీశానని.. టివి, సెల్ ఫోన్ లో ఈ సినిమా చూడటం బాగోదని అన్నారు. కేవలం థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొందే కొన్ని సినిమాల్లో వి ఒకటని డైరక్టర్ అన్నారు. సినిమాకు అమిత్ త్రివేది అద్భుతమైన మ్యూజిక్ అందించారని ఆ మ్యూజిక్ ఫీల్ అవ్వాలి అంటే సినిమా థియేటర్ లోనే చూడాలని అన్నారు. అయితే ఇలాంటి టైం లో జనాలు థియేటర్ లలో సినిమాలు చూస్తారా అంటే థియెటర్ లు ఓపెన్ చేయడమే ఆలస్యం ప్రేక్షకులు తప్పకుండా సినిమాలకు వస్తారని అన్నారు. 


అసలైతే వి సినిమా ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్ ప్లాన్ చేశారు. అంతకుముందు నుండే లాక్ డౌన్ ప్రకటించడం.. థియేటర్ లు కూడా బంద్ చేయడంతో రిలీజ్ ఆపేశారు. వి సినిమాను దిల్ రాజు నిర్మించారు. సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. నాని నెగటివ్ రోల్ లో నటించిన ఏ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా నుండి వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. 
..!

మరింత సమాచారం తెలుసుకోండి: