టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ ఉందని, కొంత వివాదాన్ని సృష్టించిన వర్ధమాన నటి శ్రీరెడ్డి, ఆ సమయంలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవకాశాల కోసం వస్తున్న కొత్త అమ్మాయిలకు, మారీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాన్ని తాను ప్రశ్నిస్తున్నానని, కొందరు సినిమా కో ఆర్డినేటర్లు, సినిమా మేనేజర్లు కలిసి, కొత్తగా వస్తున్న అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తాం అని మాయమాటలు చెప్పి వారిని లైంగికంగా లొంగతీసుకోవడం, మరికొందరిని పలు రకాల ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. 

 

అయితే అప్పట్లో ఆ ఘటన మా అసోసియేషన్ వరకు చేరింది. వారు దిగి రాక పోవడంతో శ్రీరెడ్డి ఒకానొక సమయంలో అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసి మొత్తానికి వారిని తన వద్దకు రప్పించుకుంది. ఆ ఘటనతో ఎంతో పాపులరైన శ్రీరెడ్డి, మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ పై బాగానే ఫైట్ చేసింది, చాలామంది ప్రజలు కూడా ఆమెకు సపోర్ట్ చేసారు. అయితే ఆ తరువాత ఉన్నట్లుండి ఒక ఘటనలో సడన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన శ్రీరెడ్డి, కొందరు తనను లైంగికంగా లొంగదీసుకున్నారని, అయినా సినిమా అవకాశాలు మాత్రం ఇవ్వలేదని కొందరి పేర్లు బయటపెట్టి పెద్ద సంచలనానికి తెరలేపింది. 

 

ఇక పవన్ ఘటనతో శ్రీరెడ్డి పై కొంత విమర్శలు వెల్లువెత్తడం, ఆపై ఆమె మరింతగా రెచ్చిపోయి పవన్ ఫ్యాన్స్ ని విపరీతంగా బూతులు తిట్టడం జరిగాయి. కాగా ఆ తరువాత కొన్నాళ్ళకు పూర్తిగా చెన్నై కి వెళ్లిపోయిన శ్రీరెడ్డి, అక్కడ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రాజకీయ, సినీ ప్రముఖుల పై ఇప్పటికీ సెటైర్లు వేస్తూనే ఉంది. ఇక నేడు ఏకంగా పురిచ్చి తలైవి, మహానటి, తమిళనాడు అమ్మ అయిన జయలలిత పైనే టిక్ టాక్ వీడియో ని చేసి తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది శ్రీరెడ్డి. కాగా దానిపై కొంత మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరేమో ఆ వీడియో బాగుందని అంటుంటే, మరికొందరేమో ఏంటిది, అహా మాకెంటిదని, ఆఖరికి అమ్మని కూడా వదలకుండా ఏకంగా ఆ మహానటిపైనే టిక్ టాక్ చేసావా తల్లి అంటూ ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు.....!!   

 

మరింత సమాచారం తెలుసుకోండి: