దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా పలు రంగాల వారు నిస్వార్ధం గా పనిచేసే డాక్టర్స్,పోలీస్ మరియు పారిశుధ్య కార్మికులకు ఏదో విధంగా సహాయపడుతూనే ఉన్నారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుండి కూడా దాతలు ముందుకొస్తున్నారు. ఇవాళ గబ్బర్సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన ద్రాతృత్వాన్నిచాటుకున్నారు. పోలీస్ సిబ్బందికి హ్యాండ్ వాష్ శానిటైసర్లను తన ఇంటివద్ద  అందజేశాడు.

 

సుమారు 2500 శానిటైసర్ బాటిల్స్ ని ఆయన పోలీస్ వారికీ అందజేశారు. అదేవిధంగా ఇలాంటి సమయంలో రైతులకు అండగా ఉండాలని పిలుపు నిచ్చారు. అయితే బంధువులు మరియు అన్నదమ్ములు మరియు స్నేహితులను రైతన్నలకు సహాయం చేసేందుకు సంప్రదించమని కోరుతున్నా అని ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని ఉంచారు హరీష్ శంకర్ .

మరింత సమాచారం తెలుసుకోండి: