తమిళ హీరో మరియు లవర్ బాయ్ శింబు గతంలో నయన తారతో ప్రేమాయణం నడిపిన సంగతి అందరికి తెలిసినదే. మరియు బ్రేక్ అప్ చెప్పిన సంగతికూడా తెలిసిందే .ఆమెనే కాకుండా ఇంకా పలువురితో ఈ మన్మధుడు బ్రేక్ అప్ లమీద బ్రేక్ అప్ లు చెబుతూనే ఉన్నాడు.చివరికి పాలబుగ్గల బ్యూటీ హన్సికాని కూడా శింబు ప్రేమలో కి దించాడు. అయితే ఆ విషయాన్నీ హన్సిక కూడా నిర్ధారించింది. ఈ విషయం కోలీవుడ్ అంత కోడై కూసింది . కొన్నిరోజులు వీళ్లిద్దరు ప్రేమ లో బాగా ఎంజాయ్ చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ సైలెంట్ అయిపోయారు. ఆ విషయాన్నీ హన్సికను అడుగగా మేమిద్దరం బ్రేక్ అప్ చెప్పుకున్నాం అని సింపుల్ గా చెప్పేసింది.

 

 

బ్రేక్ అప్ చెప్పుకున్నప్పటికీ వీరిద్దరూ కలసి నటిస్తూనే ఉన్నారు. కొత్తగా హన్సిక సినిమా లో శింబు గెస్ట్ రోల్ చేశాడు. ప్రస్తుతం అమ్మడు లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది.ఈ సందర్భంగా చాలామంది శింబు గురించే హన్సికను ప్రశ్నించారు. మొదట్లో ఈ ప్రశ్నలను హన్సిక పట్టించుకోలేదు. అయితే వరుసగా అవే ప్రశ్నలు వస్తుండడంతో సమాధానం చెప్పక తప్పలేదు. ఈ సందర్భంగా ఓ అభిమాని శింబు తో బ్రేక్ అప్ అయినప్పటికీ మీరు కలిసే తిరుగుతున్నారు నిజంగా మీరు బ్రేక్ అప్ చెప్పుకున్నారు అని అడిగినప్పుడు ఆమె తన సమాధానం 'మాజీ ప్రేమికులు స్నేహితులుగా ఉండకూడదా?' అంతే కాదు మేమిద్దరం మంచి స్నేహితులం ..అంతే అని విషయాన్నీ దాటేసే ప్రయత్నం చేసింది ...ఈ మిల్కీ బ్యూటీ 

మరింత సమాచారం తెలుసుకోండి: