న్యూ ఏజ్ టాలెంట్ వచ్చాక తెలుగులో కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ టైం లో ఈతరం యువ దర్శకులంతా #Tobecontinued అనే ఒక చిన్న ఛాలెంజ్ చేసుకున్నారు. హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా శైలేష్ ఒక కథ స్టార్ట్ చేసి దాన్ని కొనసాగించాలని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ కు ట్యాగ్ చేశాడు. ఇక ఆటను ఆ కథను కొనసాగించి కేరాఫ్ కంచరపాలెం డైరక్టర్ వెంకటేష్ మహాకి ట్యాగ్ చేశాడు. వెంకటేష్ మహా కూడా ఆ కథను కొంతవరకు తీసుకెళ్లి.. అతను ఇంద్రగంటి మోహనకృష్ణకు ట్యాగ్ చేశాడు. ఇంకా మోహనకృష్ణ కథ రాయలేదు. 

 

మొత్తానికి లాక్ డౌన్ టైం ను ఏం చేయాలో తెలియక ఈ న్యూ ఏజ్ గ్రూప్ డైరక్టర్స్ అంతా కలిసి ఒక కథను రాస్తున్నారు. ఒక కథను ఒకరు రాస్తే అది కామనే అవుతుంది. కానీ ఒకరు మొదలుపెట్టిన కథను మరొకరు రాయడం అంటే నిజంగా ఇదో క్రేజీ థాట్ అని చెప్పొచ్చు. వాళ్ళు స్టార్ట్ చేసిన కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లాట్ గా అనిపిస్తుంది. మరి బాగా కుదిరితే ఈ కథను ఎవరైనా ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరూ కలిసి డైరెక్ట్ చేసినా చేయొచ్చు టాలెంట్ చూపించడానికి ఎలాంటి ఫ్లాట్ ఫామ్ అయినా ఓకే అంటున్నారు నేటితరం దర్శకులు. 

 

ఎలాగూ కమిట్ అయినా సినిమాలు చేస్తూనే మరోపక్క లాక్ డౌన్ టైం లో ఏం చేయాలో తెలియక ఈ సరికొత్త కథ చర్చ మొదలుపెట్టారు. ఇప్పటివరకు రాసిన ముగ్గురు దర్శకులు చాలా ఇంట్రెస్టింగ్ గా కథను నడిపించారు. మరి మోహనకృష్ణ ఆ కథను కొద్దిగా రాసి ఎవరికీ ట్యాగ్ చేస్తాడో చూడాలి. వాళ్ళ ఆ కథ రాస్తున్న తీరుని చూసి నెటిజెన్ల ఊ కొడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: