మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అనే మాటను మరిచిపోయిన టాలీవుడ్ కు అల వైకుంఠపురములో మళ్లీ గుర్తు చేసింది. ఆరు నెలలుగా ఎక్కడ విన్నా ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా స్టైలీష్ స్టార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇందుకు తమన్ ముందే చెప్పాను కదా బ్రదర్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ సూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు బన్నీ ప్రశంసలకు కారణం ఏంటో తెలుసా.. 

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సంక్రాంతికి రిలీజైన అల వైకుంఠపురములో ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో వసూళ్లను దక్కించుకుంది. అంతేకాదు మ్యూజికల్ సూపర్ హిట్ అనే మాటను మరిచిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ సినిమా మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసింది. సాంగ్స్.. సినిమాను ఏ రేంజ్ లో పెంచుతాయనేది అల వైకుంఠపురములో సినిమాతో టాలీవుడ్ కు మళ్లీ తెలిసొచ్చింది. ముఖ్యంగా సామజవరగమన పాట సంగీతం పరంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 

 

అల వైకుంఠపురములో పాటలు తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లూ కూడా ఒక ఊపు ఊపాయి. ఈ మూవీ ఆల్బమ్ వంద కోట్ల పైచిలుకు వ్యూస్ సాధించింది. ఆడియోకు ఇంతటి రెస్పాన్స్ రావడంపై బన్నీ, తమన్ ను తాజాగా ప్రశంసించాడు. ఈ మధ్య కాలంలో ఓ ఆడియో ఆల్బమ్ కు 100కోట్ల ప్లే ఔట్స్ రావడం వెరీ గ్రేట్ అనే చెప్పాలి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ బన్నీ ట్వీట్ చేశాడు. తమన్ నేను చాలా గర్వంగా  ఫీలవుతున్నాను. నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకున్నావంటూ ట్వీట్ చేశాడు. 

 

అల వైకుంఠపురములో మ్యూజిక్ సిట్టింగ్ టైమ్ లో అల్లు అర్జున్, తమన్ ని లైప్ సాంగ్ గుర్తుండిపోయే పాటలు ఇవ్వాలని అడిగాడట. పాటలు బ్లాక్ బస్టర్ గా నిలవాలని వందకోట్లకు పైగా వ్యూస్ రావాలని కోరాడట. అప్పుడు తమను తప్పకుండా బ్రదర్.. నీకు మాట ఇస్తున్నా వందకోట్లు వ్యూస్ దాటే ఆల్బమ్ ఇస్తానన్నాడట. ఇప్పుడు అల వైకుంఠపురములో వందకోట్ల 13లక్షల వ్యూస్ సాధించింది. మాట నిలబెట్టుకున్నావు. థ్యాంక్ బ్రదర్ అని బన్నీ ట్వీట్ చేశాడు. ఇందుకు తమన్ ఈ ట్వీట్ ను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను బ్రదర్ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: