అర్జున్ రెడ్డి సినిమా తర్వాత... విజయ్ దేవరకొండ కు వచ్చిన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని తో సినిమాలు చేయడానికి ఎందరో దర్శకులు ముందుకి వచ్చారు. ఆ తర్వాత అతను గీత గోవిందం అనే సినిమ ద్వారా హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా అతను మంచి సినిమా చేయలేదు. అన్నీ కూడా ఫ్లాప్ అవ్వడం తో అతని డిమాండ్ అనేది భారీగా పడిపోయింది. ఇక ఇప్పుడు అతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూరి తో అతను చేస్తున్న సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ని ఖరారు చేసింది చిత్ర యూనిట్. 

 

ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ తో సినిమా తర్వాత అతను బాలీవుడ్ సినిమా ఒకటి చేసే అవకాశం ఉందని సమాచారం. బాలీవుడ్ సినిమాలో బాబు కి ఆఫర్ వచ్చింది అని అంటున్నారు. ఆ సినిమాలో అతనికి ఒక కీలక పాత్ర కూడా వచ్చిందని అందుకే విజయ్ ఓకే చెప్పాడు అంటున్నారు. ప్రస్తుతం అతను చేస్తున్న నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను అతనికి ఇచ్చాడు అని టాక్. విజయ్ అయితే కరెక్ట్ సరిపోయే అవకాశం ఉందని భావించి ఈ ఆఫర్ ని కరణ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ గడ్డం బాగా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. 

 

సినిమా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో వస్తుందని టాక్. అందుకే ఈ సినిమాకు గానూ అతను ఓకే చెప్పాడని అంటున్నారు. కథలో బాగా పట్టు ఉందని నటనకు ప్రాధాన్యత ఉండటం తో ఓకే చేసాడని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. అతను ఇటీవల నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: