ఈ కరోనా మహమ్మారి ఎందుకు వచ్చిందో తెలీదు కానీ.. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది.. బయటకు వెళ్తే పోలీసులు కొడుతారు.. ఎట్లా అబ్బా.. టైం పాస్ అయ్యేది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. టీవీ పెడితే అవే చెత్త ప్రోగ్రామ్స్ మాటకి వేస్తారు.. అవి వద్దు రా స్వామి అని చెప్పిన వినరు.. కొత్త సినిమాలు ఏమో ఆదివారాలు తప్ప ఇంకా ఎప్పుడు వెయ్యరు. 

 

అలాంటి సమయంలోనే హారర్ అంటే ఇష్టమున్న వారు ఈ టాప్ 5 హారర్ సినిమాలు చూస్తే బెదిరిపోతారు.. అవి చూసి టైం పాస్ చెయ్యండి.. రాత్రి పూట దడుచుకోకండి. ఆ 5 టాప్ తెలుగు హారర్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

టాప్ 5 హారర్ సినిమా.. చంద్రముఖి!

 

రజినీకాంత్ హీరోగా.. జ్యోతిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్.. అందరూ బెదిరిపోయారు అంటే నమ్మండి.. అలాంటి ఈ సినిమా ఎప్పటికి సూపర్ హిట్టే.. ఇప్పటికి బయపెట్టేస్తుంది. అలాంటి ఈ సినిమాను మళ్లీ ఓసారి చూసేయండి. 

 

టాప్ 4 హారర్ సినిమా.. కాంచన!

 

రాఘవ లారెన్స్ తీసిన ఈ సినిమా అప్పట్లో ఓ వూపు వూపేసింది. ఈ సినిమా చూడాలి అనిపిస్తుంది... చూస్తే భయం వేస్తుంది.. ఇంకా ఆ మ్యూజిక్ తలుచుకుంటే వామ్మో.. చెప్పకూడదు. హిజ్రా దెయ్యం అయితే ఎంత ఘోరంగా చంపుతుందో బయపెట్టేశారు. 

 

టాప్ 3 హారర్ సినిమా.. ప్రేమ కథ చిత్రం!

 

ఒక దెయ్యం సినిమాలో కూడా ప్రేమ.. కామెడీ అన్ని విధాలుగా ఉండేలా తీసిన సినిమానే ఇది.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహించారు.. ఇప్పటికి కామెడీ థ్రిల్లర్ ఏ ఇది. 

 

టాప్ 2 హారర్ సినిమా.. అరుంధతి!

 

లేడీ సూపర్ స్టార్ అనుష్క తీసిన ఈ హారర్ సినిమా అప్పట్లో మార్వెలస్ హిట్టు.. ఇంకా ఈ సినిమాలో వచ్చే జేజమ్మ.. మాయమ్మ సాంగ్ అద్భుతం అంటే అర్ధం చేసుకోండి.. ఇంకా ఈ సినిమాలో ఎలాంటి రాక్షషుడిని చంపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  

 

టాప్ 1 హారర్ సినిమా.. రాజుగారి గది!

 

ఓంకార్ లో ఇలాంటి టాలెంట్ కూడా ఉంది అని ఈ సినిమా చూశాకే తెలిసింది.. ఈ సినిమా కూడా అంతే.. రియాలిటీ షో పేరుతో అందరిని వణికించేసింది.. ఈ సినిమా కూడా మంచి త్రిల్లర్ ఏ..  

 

కేవలం ఈ సినిమాలే కాదు ఇంకా చాలా హర్రర్ ఫిల్మ్స్ ఉన్నాయి.. పాతాళభైరవి, భాగమతి, గీతాంజలి, కాష్మోరా, దెయ్యం, అవును అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలో.. చెప్పాలి అంటే.. రామ్ గోపాల్ వర్మ సినిమాలు, రవి బాబు సినిమాలు అన్ని హర్రర్ సినిమాలే.. ఎం అంటారు.?

మరింత సమాచారం తెలుసుకోండి: