టామ్ అండ్ జెర్రీ సృష్టిక‌ర్త జీన్ డిచ్ క‌న్నుమూశారు.కోట్లాది మంది ఆయ‌న అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. టామ్ అండ్ జెర్రీ ఆ యానిమేటెడ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గురించి  తెలియ‌నివారుండ‌ట‌రంటే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు. టామ్ అండ్ జెర్రీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ షోకు అభిమానులున్నారు. ఎంతో ప్రజాదరణ పొందింది. భాష‌,ప్రాంతాల‌తో బేధం లేకుండా ఈ షో కోట్లాది మంది అభిమానుల‌ను త‌న సొంతం చేసుకుంది. టామ్ అండ్ జెర్రీలోని కారెక్ట‌ర్ల‌ను బహుశా అంత అద్భుతంగా ఎవ‌రూ తెర‌పై అంత వినోదాత్మ‌కంగా చూప‌లేరేమో..? అని భావించ‌డంలో ఎంత‌మాత్రం సంకోచించాల్సిన అవ‌స‌రం లేదు. 

 

95 ఏళ్ల వయస్సున్న జీన్ డిచ్ చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌ నగరంలోని తన అపార్టుమెంట్‌లో ఏప్రిల్ 16 రాత్రి మరణించిన‌ట్లు స‌న్నిహితులు ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న మ‌ర‌ణ వార్త ప్ర‌పంచానికి చాలా ఆల‌స్యంగా తెలిసింద‌నే చెప్పాలి. డిచ్ టామ్ అండ్ జెర్రీ యానిమేటెడ్‌తో ప‌రిచ‌యం కాక‌ముందు అమెరికా వైమానిక దళంలో పని చేశాడు.1959 నుంచి ఆయ‌న ప్రేగ్‌లోనే నివాసం ఉంటున్నారు. డీచ్‌కు యానిమేటెడ్‌తో పాటు చిత్ర క‌ళ‌లంటే ఎంతో మ‌క్కువ‌ట‌. అందుకే త‌న చిత్రాల్లో ఏదో ఒక పాత్ర‌కు చిత్ర క‌ళ అంటే ఇష్ట‌మ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. 

 

చిత్ర కళలపై మక్కువ ఉండటంతో  అనేక కార్టూన్స్ గీసారు.  ఈ క్రమంలోనే మన్రో అనే చిత్రం కూడా తెరకెక్కించిన విష‌యం తెలిసిందే. 1960లో బెస్టు యానిమేటెడ్‌ షార్ట్ ఫిలింగా ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారు. అలాగే  సినిమాలు, సీరియల్స్‌తో బిజీ బిజీగా గడిపే ప్రేక్షకులని కార్టూన్ సీరియల్స్ వైపు దృష్టి మరల్చేలా చేసిన ఘనత మాత్రం  జీన్ డిచ్‌కే ద‌క్కింది. ఆయ‌న టామ్ అండ్ జెర్రీతోనే కార్టూన్ వీడియోల‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగింద‌నే చెప్పాలి.  టామ్‌ అండ్‌ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. ఇందుకు గాను  ఆయనకి ఆస్కార్ అవార్డ్ కూడా లభించింది. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: