టాలీవుడ్ లో సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ఇక్కడ క్లిక్ అయితే వచ్చే అవకాశాలు కూడా బాగుంటాయి. అందుకే మిగతా సౌత్ పరిశ్రమల కన్నా తెలుగు ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తారు అందాల భామలు. లేటెస్ట్ గా తెలుగులో ఒకేసారి రెండు సినిమాలతో ఎంట్రీ ఇస్తుంది కర్ణాటక భామ అమృత అయ్యర్. రామ్ తో రెడ్ మూవీ చేస్తున్న ఈ అమ్మడు యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో కూడా నటించింది. నీలి నీలి ఆకాశం పాటతో ఒక్కసారిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమృత అయ్యర్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో తను ఎలాంటి సినిమాలు చేయాలని ఉందో ప్రేక్షకులతో పంచుకుంది. 

 

అభినయానికి ప్రాధాన్యత ఉన్న సినిమాలు తాను చేయాలని ఉందని.. సినిమాలో ఆ పాత్ర తాను మాత్రమే చేయగలను అనే నమ్మకం దర్శకులకు కలిగేలా చేయాలని అంటుంది. ఇక గ్లామర్ షో విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తుంది అమృత. అందంగా కనిపించడం వరకు ఓకే కానీ అంతకుమించి అంటే మాత్రం తన వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. నీలి నీలి ఆకాశం పాటలో వింటేజ్ లుక్ లో చాలా క్యూట్ గా అనిపించింది అమృత అయ్యర్. 

 

యాంకర్ ప్రదీప్ హీరోగా మొదటి ప్రయత్నంగా వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? మున్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలైతే మార్చి 25 ఉగాది సందర్భంగా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడాల్సి వచ్చింది. మోడల్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్ గా మారిన అమృత ఎప్పుడు తన లిమిట్స్ దాటి వెళ్లానని చెబుతుంది. మరి అమ్మడు చెప్పినట్టుగా స్కిన్ షో చేయకుండా ఆఫర్లు అందుకుంటుందో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: