తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలున్న  పవన్ కళ్యాణ్ కు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు పవన్ కళ్యాణ్. ఏ హీరోకు లేనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే టాలీవుడ్ లో ఏ హీరో ఫంక్షన్ జరిగిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సినిమాల్లో టాప్ హీరో గా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. దాదాపు రెండేళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అటు  రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేయాలని భావించి మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

.

 

 ఎన్నో రోజుల నుండి తమ అభిమాన హీరో కోసం అభిమానులు నిరీక్షణ ఇంకొన్ని రోజుల్లో తీరబోతుంది అనుకుంటున్న తరుణంలో...కరోనా  వైరస్ కారణంగా సినిమా షూటింగ్ కాస్త వాయిదా పడింది. దీంతో రిలీజ్ డేట్ కాస్త వాయిదా పడింది. కాగా ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా  తమన్ సంగీతం అందిస్తున్నారు నివేదాథామస్ అంజలి అనన్య  హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటిసారిగా లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు కూడా ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత విడుదలైన మగువా ఓ మగువా అనే సాంగ్ కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. 

 

 

 అయితే ముందుగా వకీల్ సాబ్ సినిమాను మే 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా  వైరస్ కారణంగా షూటింగ్ కాస్త నిలిచిపోవడంతో విడుదల వాయిదా పడింది అనే టాక్ కూడా వినిపిస్తోంది. కాగా  వకీల్ సాబ్   కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది అనే ఓ న్యూస్ తాజాగా ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్  సినిమా స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15న విడుదల కాబోతుంది అని సమాచారం. ఈ విషయం త్వరలో చిత్రబృందం కూడా అధికారికంగా ప్రకటించపోతుందట. దీంతో ఫ్యాన్స్ కి రెండు పండుగలు కానున్నాయి ఒకటి స్వతంత్ర దినోత్సవం కాగా మరొకటి వకీల్ సబ్ సినిమా విడుదల కావడంతో ఆ రోజున ఫ్యాన్స్ రెండు  పండుగలను సెలబ్రేట్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: