ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా అభిమానులు మొత్తం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా..  ఎవరి నోట విన్నా 'ఆర్.ఆర్.ఆర్' మాటే వినిపిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్.ఆర్.ఆర్)... ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ‘రౌద్రం రణం రుధిరం’ కోసం తార‌క్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ భాష‌ల్లో కూడా డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నారు. చరణ్ బర్త్ డే వీడియోకి ఎన్టీఆర్ ఒక్క మలయాళ భాషలో తప్ప అన్ని భాషల్లో డబ్బింగ్ కూడా చెప్పారు కూడా. కాగా తాజాగా మ‌ల‌యాళ భాష కూడా ఎన్టీఆర్ నేర్చుకుంటున్నాడట.. డబ్బింగ్ చెప్పడానికి వీలుగా ప్రస్తుతం ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట. కరోనా లాక్ డౌన్ తో వచ్చిన ఖాళీ సమయాన్ని ఎన్టీఆర్ ఇలా వేరే భాషలు నేర్చుకోవడానికి పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మలయాళ వర్షన్ కి కూడా డబ్బింగ్ చెప్పడానికి ఆ భాష పై పట్టు సాధిస్తున్నాడట.

 

కాగా 'రౌద్రం రణం రుధిరం' చిత్రాన్ని రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఫస్ట్ నుండి అన్ని యావత్ సినీ ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ రామ్ చరణ్ ఇంట్రో స్పెషల్ వీడియో ఒక రేంజ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ బర్త్ డేకి ఇంకో వీడియో వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: