తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న నటసార్వభౌముడు మన నందమూరి తారక రామారావు గారు. ఈయన ఎన్నో సినిమాలలో తన నటనతో అభిమాన జనాన్ని ఉర్రూతలూగించారు. ఆధ్యాత్మికంగా దగ్గరయ్యారు.  జీవితంలో ఎవరికైనా అలవాటు అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ అలవాటు వ్యసనంగా మారి విపరిణామాలకు దారితీస్తుంది. దీనిని కొందరు.. తనంతట తానే మానేసినా .. కొందరు మాత్రం ఈ అలవాటును మానటం చాలా కష్టతరంగా భావిస్తారు. ఇలాంటి సంఘటనే మన నట  శేఖరుడి కి ఎదురయింది. నందమూరి తారక రామారావు గారికి కిళ్లీ అంటే పడి చచ్చిపోయేంత ఇష్టం.

 

ఈ అలవాటును ఎవరు మానుకోమని వేడుకున్నా  మానుకొనేవారు కాదు. అయితే ఈ అలవాటు ఎన్టీఆర్ గారికి మాయాబజార్ సినిమా వరకూ ఉండేది. మాయాబజార్ సినిమాకి  సంతకం చేసేటప్పుడు .. కె.వి రెడ్డిగారు ఓ  షరతు విధించారు.. నువ్వు.. కిళ్లీ అలవాటు మానుకోవాలి కిళ్లీ వల్ల పళ్ళు పాడైపోతాయి.. కృష్ణుడి పళ్ళు తెల్లగా ఉండాలి.. కానీ కిళ్లీ వేసుకుంటే ఆ తెల్లదనం రాదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ గారు కిళ్లీ నీ మాన లేకపోయారు. దానితో కె.వి రెడ్డిగారు ఉపాయాన్ని కనిపెట్టారు.. అదేంటంటే ఎన్టీఆర్ కి ప్రతిరోజు పదుల సంఖ్యలో కిళ్లీ లను భోజనంగా పంపేవారు.... అదే భోజనం, అదే అల్పాహారం.

 

ఆకలేస్తుంది అంటే కిళ్లీలు పంపేవారు దాదాపు మూడు రోజులు హౌస్ అరెస్ట్ లో ఉంచి కిళ్లీ మీద కిళ్లీ లు తినిపించారు.. దానితో ఎన్టీఆర్ గారికి కిళ్లీల మీద  విరక్తి పుట్టింది. ఇక నేనెప్పుడూ కిళ్లీ జోలికి పోను గురువుగారు అంటూ.. ఈ పూటకి భోజనం పంపండి అనేంతవరకు కిళ్లీలతో దాడి కొనసాగింది. ఆయనకి కిళ్లీ వేసుకునే అలవాటు తప్పిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓ సినిమా షూటింగ్లో కిళ్లీ.. వేటూరి రూపంలో ఆయనను పలకరించింది... వేటూరి గారు పాటలు రాసేటప్పుడు జరదా కిళ్లీ డబ్బాను దగ్గర ఉంచుకునే వారు.. ఎన్టీఆర్ గారికి సినిమా పాట రాసే టైంలో వేటూరి గారు కిళ్లీ వేసుకుని పాటను రాస్తూ ఉన్నారు..

 

 

షూటింగ్ మధ్యలో రెస్ట్ తీసుకుంటున్న ఎన్టీఆర్ గారికి ఆ వాసన తగిలి  ఈ కిళ్లీ వాసన ఎక్కడ నుంచి వస్తుంది అని ఆరా తీశారు... దానికి భయపడిన  వేటూరి గారు ఎన్టీఆర్ గారు నాకు కిళ్లీ వేసుకోకపోతే  పాటలు రాయలేను... అందుకే  కిళ్లీ వేసుకుంటున్నాను అని సమాధానమిచ్చారు.... అయితే ఎన్టీఆర్ గారు ఆ జరదా కిల్లి డబ్బా తీసుకురమ్మని....ఓ కిళ్లీ ని  వేసుకున్నారు. 20  సంవత్సరాల  తర్వాత  ఆకిళ్లీ నీ వేసుకున్నందుకు ఆయనకు కళ్ళు తిరుగుతాయి ఏమో అని వేటూరి..భయపడ్డారు, కానీ చాలాసేపు నిద్రించిన తర్వాత సినిమా  షాట్ కి సాధారణంగా లేచి వెళ్లిపోయారు. ఈ సన్నివేశం చూసిన  వేటూరి గారు ఆయన గట్టి మనిషి కాబట్టి దానిని తట్టుకుని చాలా సాధారణంగా షూటింగ్ కి అలా లేచి వెళ్లిపోయారని మనసులో అనుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: