భర్తగ మారకు బ్యాచిలరు.. సోలో లైఫే సో బెటరు అని ఎంతో మంది రచయితలు చెప్పారు. లాక్ డౌన్ లో చాలామంది ఈ పాటను భర్తల సంఘానికి డెడికేట్ చేస్తున్నారు. అయితే భర్తగా మారకుందే సుస్మితాసేన్ బాయ్ ఫ్రెండ్ కు కష్టాలు మొదలయ్యాయి. సూపర్ మోడల్ రొహ్మాన్ షాల్ ని మాస్టర్ చెఫ్ గా మార్చేసింది సుస్మిత. 

 

సుస్మితా సేన్ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. ప్రైవేట్ లైఫ్ గురించి కూడా పబ్లిక్ గానే చెబుతుంది. ఇలాగే బాయ్ ఫ్రెండ్ రొహ్మాన్ వంట గురించి స్టేట్ మెంట్ ఇచ్చింది సుస్మిత. ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలామంది హీరోయిన్లు కిచెన్ లో బిజీగా గడుపుతున్నారు.  కొత్తవంటలు ట్రై చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే సుస్మిత మాత్రం వర్కవుట్స్ చేస్తూ వాటిని అప్ లోడ్ చేసే పనిలో బిజీగా ఉంటోంది. 

 

సుస్మితా సేన్ ఫ్యామిలీతో కలిసి ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో క్వారంటైన్ పీరియడల్ లో కిచెన్ విజిట్ చేశారా.. అంటే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.బాయ్ ఫ్రెండ్ రొహ్మాన్ షాల్ బాగా వంట చేస్తాడని.. అతను మంచి చెఫ్ అని చెప్పింది. అందుకే రొహ్మాన్ కు ఆ బాధ్యతలు అప్పగించి.. తాను వేరే పనులతో బిజీగా ఉన్నానని చెప్పింది. 


సుస్మితా సేన్ స్టేట్ మెంట్స్ విని చాలా మంది రోహ్మాన్ పై జాలి చూపిస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ గా ఉండగానే కిచెన్ లో కష్టపడుతున్నావు. భర్తగా మారకముందే ఇంత పనిచేస్తుంటే.. భర్త హోదా వచ్చాక రోబోలా మార్చేస్తారు అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సుస్మితా సేన్ కు కాబోయే భర్త వంటింట్లో తెగ కష్టపడిపోతున్నాడు. తన లవర్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ కొత్తకొత్తగా ట్రై చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: