ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రతిదేశంలోనూ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఇంట్లో నుండి అడుగు తీసి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. దీంతో ప్రజలంతా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. సినిమా హాలు మూతపడటంతో చాలా వరకు ఓటిటి ప్లాట్ ఫామ్ లో నెట్ ఫ్లిక్స్ ద్వారా వెబ్ సిరీస్ చూస్తూ లాక్ డౌన్ టైం నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ టాప్ ఫైవ్ వెబ్ సిరీస్ లను చూస్తూ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 

  1. Breaking Bad :

 

ప్రపంచ వెబ్ సీరీస్ చరిత్ర లోనే నెంబర్ వన్ గా చెబుతారు ఈ సీరీస్ గురించి. క్యాన్సర్ తో బాధపడే ఒక కెమిస్త్రీ ప్రొఫెసర్ తన స్టూడెంట్ తో కలిసి డ్రగ్స్ తయారు చేయడం .. అది దేశం లోనే నెంబర్ 1 డ్రగ్ గా డ్రగ్ మాఫియా లో దూసుకుపోవడం. ఇది తయారు చేసింది ఎవరు అని పెద్ద పెద్ద మాఫియా డాన్స్ ఉలిక్కిపడ్డం, ఈ సీరీస్ కథ. ఈ మధ్యలో అతని క్యాన్సర్ నయం అయిపోతుంది, కానీ అతనికి డబ్బు పిచ్చి - మోనోపోలి పిచ్చి పట్టుకుంటుంది. అటువైపు ఎదురైన సంఘటనలు .. ఎలా తన ఫామిలీ నీ అతని జీవితాన్నీ నాశనం చేశాయి అనేది కథాంశం. వాల్టర్ వైట్ - హైసెన్ బర్గ్ కారెక్టర్ కి ప్రపంచమే ఫిదా అయ్యింది . 

 

  1. Money Heist : 

 

బ్యాంకు దొంగతనం నేపధ్యం లో తెరకెక్కిన ఈ సీరీస్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ కాలం యువత కోరుకునే యాక్షన్ సన్నివేశాలు, మధ్యలో ప్రేమలు, పోలీసుల ప్లాన్ లూ .. బ్యాంకు లో జరిగే పరిణామాలు ఇవన్నీ కూడుకుని సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుంది. ప్రొఫెసర్ అనే కారెక్టర్ ఇప్పుడు అందరికీ సుపరిచితం అయ్యింది. 

 

  1. Mind Hunter 

డైరెక్టర్ డేవిడ్ ఫించర్ తీసిన ఈ సీరీస్ పర్ఫెక్ట్ సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ గా చెప్పచ్చు. మర్డర్ మిస్టరీ లు అన్నీ చేధించుకుంటూ వెళ్ళే డిటెక్టివ్ ల నడుమ సాగుతుంది ఈ కథ. ఆడవారి మీద జరుగుతున్న క్రైమ్ గురించి కూడా చాలా బాగా తీశాడు అనే చెప్పాలి 

 

  1. DARK 

Christopher Nolan సినిమా లు ఎక్కువగా చూసేవాళ్ళకి ఈ సీరీస్ బాగా నచ్చుతుంది. కథాంశం పూర్తిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటూ ఒకటికి రెండు సార్లు చూస్తే కానీ అర్ధం కానీ , గూడార్ధం తో సాగుతుంది ఈ సీరీస్. 1980 నుంచి 2030 వరకూ పాత్రలు వెనక కాలం లోకి వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు. మొదట్లో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా కనక్ట్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వలేని సీరీస్ .. 

 

  1. NARCOS 

పాబ్లో ఎస్కోబార్ అనే డ్రగ్ మాఫియా డాన్ జీవితం మీద తెరకెక్కిన చిత్రం ఇది .. అధికారం - మాఫియా కోసం కొన్ని దేశాల్లో ఎలాంటి దారుణాలు చేస్తారు. ఎంతావరకూ వెళతారు . పార్లమెంట్ లనే కూల్చేయడం .. ఇలా అనేక ట్విస్ట్ ల నడుమ సాగుతుంది ఈ సీరీస్.

మరింత సమాచారం తెలుసుకోండి: