అక్కినేని నాగార్జున న‌టించిన చిత్రాలు ఎన్నో ఉన్నా మ‌న్మ‌ధుడు చిత్రం మాత్రం ఆయ‌న కెరియ‌ర్ లో చెప్పుకోద‌గ్గ బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్పాలి. ఆ చిత్రంలో నాగ్ ఎంతో రొమాంటిక్‌గా క‌నిపిస్తారు. ఈ చిత్రంలో ఆయ‌న స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు న‌టించారు. ఒక‌రు అన్షు మ‌రొక‌రు సోనాలి బింద్రే న‌టించారు. మన్మథుడు 2002 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఆడవాళ్ళంటే ఇష్టం లేని కథా నాయకుడు అలా ఎందుకు మారాడు తిరిగి అతను ఎలా మారాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈచిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు డైలాగ్ రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ పంచ్ డైలాగుల‌తో అద‌ర‌గొట్టార‌ని చెప్పాలి. ఈ చిత్రానికి ఆయ‌న డైలాగులు ఇచ్చారు. 

 

ఈ చిత్రం ఎంతో హాస్యాస్ప‌దంగా..మంచి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఇప్ప‌టికీ ఈ చిత్రం బుల్లితెర మీద వ‌స్తే మంచి టిఆర్పీ రేటింగ్ వ‌స్తుంది. ఈ చిత్రంలో ఉండే ప్ర‌తీ పంచ్ డైలాగ్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనివి. ఇందులో హీరోహీరోయిన‌ల్ల మ‌ధ్య వ‌చ్చే పంచ్ డైలాగ్స్ అయినా క‌మెడిన్స్ మ‌ధ్య వ‌చ్చేవైనా అలాగే బాబాయ్‌గా త‌నికెళ్ళ భ‌ర‌ణి న‌టించారు ఆయ‌న కాన్‌వ‌ర్‌జేష‌న్‌లో వ‌చ్చే సీన్లు అయినా స‌రే మ‌హాద్భుత‌మ‌ని చెప్పాలి. ఇందులో ప్ర‌తీ డైలాగ్ అంద‌రికి ఇప్ప‌టికీ గుర్తుండేవే. అలాగే ప్ర‌ముఖ హాస్య న‌టుడు బ్ర‌హానందం ఎంట‌ర్ అయిన త‌ర్వాత వ‌చ్చే ప్ర‌తీ డైలాగ్ అదిరిపోతాయి. ఇప్ప‌టికీ ఆ డైలాగుల‌న్నీ కూడా ఈ చిత్రం చూసిన ప్ర‌తీ ప్రేక్ష‌కుడి నోట్లోనే ఉంటాయి.

 

 బ్ర‌హ్మానందం డైలాగ్‌లు ఒక్కోటి ఒక్కో ర‌కంగా ఎంతో అద్భుతంగా ఉంటాయో.. ఆమె న‌న్ను ప్రేమించింది త‌ర్వాత నేను ప్రేమించాల్సొచ్చింది అనే డైలాగ్ ఇప్ప‌టికీ హైలెట్ అని చెప్పాలి. బంకు శీను పాత్ర‌లో న‌టించిన సునీల్ పాత్ర కూడా చాలా బావుంటుంది. ఆయ‌న పంచ్ డైలాగులు కూడా బావుంటాయి. ఇక ఈ చిత్రంలో చాలా వ‌ర‌కు నాగార్జునే పంచ్ డైలాగ్‌లు వేసి అంద‌ర్నీ న‌వ్విస్తాడు. ఇక క‌మెడియ‌న్ల ప‌రిస్థితి ప‌క్క‌న‌పెడితే నాగ్ పెర్ఫార్మెన్స్ సూప‌ర్బ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: