కొన్నాళ్లుగా తన తదుపరి సినిమా కోసం పలువురు దర్శకుల నుండి కథలు వింటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి నిశ్చయించినట్లు టాక్. గతంలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల కలయికలో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం ఎంత గొప్ప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల మహేష్ వద్దకు వెళ్లిన  పరుశురాం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని ఆయనకు వినిపించటం, అది ఎంతో నచ్చిన మహేష్ తదుపరి సినిమాని పరశురాంతో చేయడానికి నిశ్చయించడం జరిగిందని అంటున్నారు. కాగా అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మూడు రోజుల క్రితం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించారు. 

 

అయితే గతంలో బాహుబలి 2 భాగాలు తెరకెక్కించి ఎంతో గొప్ప అత్యద్భుత విజయాలు అందుకున్న రాజమౌళి, ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ సినిమాని వాటిని మించే విధంగా తీస్తున్నట్లు టాక్. అయితే మరి మహేష్ బాబు, రాజమౌళి ల కాంబినేషన్ లో త్వరలో రాబోయే సినిమా ఏ రేంజ్ లో రికార్డులను సృష్టిస్తుంది అనే విషయమై ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వాస్తవానికి బాహుబలి 2 భాగాలు తర్వాత రాజమౌళి విదేశాల్లో విపరీతమైన కీర్తిని గడించిన విషయం తెలిసిందే. అలానే ఇప్పటి వరకు ఒక్క తెలుగులో తన వేరొక భాషలో సినిమా చేయనప్పటికీ, అటు బాలీవుడ్ తో పాటు పలు సౌత్ సినిమా ఇండస్ట్రీల్లోనూ మంచి పేరు దక్కించుకున్నారు మహేష్. ఇక మహేష్ పేరు చెబితే చాలు పడిచచ్చే బాలీవుడ్ హీరోయిన్లు ఎందరో ఉన్నారు. 

 

అలానే పలు ఇతర సౌత్ భాషల్లోని కొందరు హీరోయిన్లు కూడా మహేష్ అంటే ఎంతో అభిమానం చూపిస్తుంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఓవర్సీస్ లో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్,  క్రేజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ మొత్తం సమీకరణాలు చూసుకుంటే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా అలాంటిలాంటి విజయాన్ని కాదని, తప్పకుండా బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి వాటి రికార్డులను సునాయాసంగా బద్దలుకొట్టడమే కాకుండా, దాదాపుగా కొన్నేళ్ల వరకు మనదేశ ప్రేక్షకులు మాట్లాడుకునే విధంగా అత్యద్భుత విజయాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు కొందరు విశ్లేషకులు. సరైన పాయింట్ తో మహేష్ బాబుని సరైన క్యారెక్టర్ లో రాజమౌళి గనక చూపించగలిగితే, తప్పకుండా అది జరిగితీరుతుందని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: