అందాల ముద్దుగుమ్మ సుష్మితా సేన్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు  అందాల ఆరబోతతో ఎంతోమందిని అలరిస్తూనే మరోవైపు తనదైన శైలి నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అయితే ఓ వైపు వరుస చిత్రాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సుష్మితా సేన్ తో పాటు ఆమె ప్రియుడు  రోహ్మన్ షాల్  కూడా ఎప్పుడు  సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. ఇక వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 

 


 వీరిద్దరూ ఎప్పుడూ తమ సినిమాలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పెంచుకోవడంతో పాటు... తమ వ్యాయామ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక సుస్మితాసేన్ అయితే తన హాట్ హాట్ అందాలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్  పుట్టిస్తుంది. అయితే బాలీవుడ్ లో ఈ జంట చూడముచ్చటగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా సుస్మితాసేన్ ప్రియుడు రొహ్మన్  ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫోటో  ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటో రొహ్మన్  వ్యాఖ్యలు వీరిద్దరి ప్రేమను అభిమానులకు తెలియజేస్తున్నాయి. 

 


 సుస్మితాసేన్ ఒక మంచి అందగత్తె అన్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. కానీ సుష్మితా సేన్ ఒక మంచి చేస్  ప్లేయర్ కూడా అని మీలో ఎంతమందికి తెలుసు అంటూ రొహ్మన్  ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోని పోస్ట్ చేశాడు. ఒక డిఫరెంట్ పోజు లో ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన కాళ్ళ కింద నుంచి చేతులు ముడుచుకుని నమస్కారం చేస్తూ ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు రొహ్మన్.  దీనికి  ఇలా రాశాడు... డియర్  సుష్మితా సేన్.. మీరు చదరంగం లో బాగానే ఉన్నారు.. చదరంగాన్ని బాగా ఆడతారు అందుకని నా కాళ్ళ కింద నుంచి చేతులు ముడుచుకుని మీరు చదరంగంలో మంచివారు అని చెబుతున్నాను అంటూ ఈ ఫోటోని పోస్ట్ చేశాడు. అంతేకాకుండా సుస్మితాసేన్ తో ఉన్న ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ఈ వీడియోలో ఈ జంట కలిసి యోగా చేయడం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: