టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.  ఈ జాబితాలోకి వస్తాడు హీరో శ్రీ విష్ణు.  ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా  నటించాడు.  ఆ తర్వాత హీరోగా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు.  మొదటి నుంచి వైవిద్యమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న మరో విభిన్నమైన చిత్రమే 'రాజ రాజ చోళ'. పూర్తి వినోదభరితమైన ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.  ప్రస్తుతం కరోనా వైరస్  ప్రభావంతో అన్ని సినిమాల షూటింగ్స్ ఆపివేసిన విషయం తెలిసిందే.

 

తాజా ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు మాట్లాడుతూ ..  నాకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో ఎలాంటి పాత్రలను నా నుంచి ఆడియన్స్ ఆశిస్తారనే విషయంలో నాకు ఒక అవగాహన వుంది. అందుకు తగినట్టుగానే కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వుంటాను. కొత్త దర్శకులతో నేను వెంటనే కలిసిపోతాను. నేను చిన్న పాత్రలు వేస్తున్న సమయంలో దర్శకుల పనితీరు బాగా గమనించేవాన్ని.. ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నవారు సైతం దర్శకులకు ఎంతో గౌరవం ఇవ్వడం చూస్తున్నాను. అందుకే నాకు నిర్మాతలన్నా, దర్శకులు అన్నా చాలా గౌరవం అన్నారు.  

 

అందువలన వాళ్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వెళుతున్నాను. తెలుగు ఇండస్ట్రీలో నారా రోహిత్ నాకు ప్రాణ స్నేహితుడు.  మేం కలిసి నటించిన సినిమా నటించాం.  ఇన్నేళ్ల స్నేహంలో ఒక్కసారి కూడా నా మనసుకు కష్టం కలిగేలా తను ప్రవర్తించలేదు. నేను బిజీగా వుండి కాల్ చేయడం మరిచిపోతే, తను మాత్రం తప్పకుండా కాల్ చేస్తాడు. తను ఎక్కడికి వెళ్లినా మా ఫ్యామిలీ కోసం కూడా షాపింగ్ చేస్తాడు. ఇండస్ట్రీలో నాకు అంత మంచి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: