మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సినిమా పేరును ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ చిరంజీవి నోటి నుండి రావడంతో అదే పేరును ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిన్నపాటి క్యామియో రోల్ కాకుండా అరగంట పాటు స్క్రీన్ స్పేస్ ఉండే పాత్ర అని సమాచారం.

 

ఇకపోతే ఆచార్యలో చిరంజీవి, రామ్ చరణ్ లు గురుశిష్యులుగా కనిపిస్తారట. ఈ సినిమ నుండి హీరోయిన్ త్రిష తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కాజల్ చిరంజీవితో ఇది రెండవ చిత్రం. ఖైదీ నంబర్ ౧౫౦ సినిమాలోనూ చిరంజీవి సరసన కాజల్ మెరిసింది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.

 


అందువల్ల మళ్ళీ షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో క్లారిటీ లేదు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా షూటింగులకి అనుమతులు ఇస్తారా అన్నది సందేహమే. వందలాది మంది పాల్గొనే షూటింగులకి అనుమతులు ఇవ్వడం కష్టమే. అదీగాక ఇతర రాష్ట్రాల నుండి రాకపోకలు ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆచార్య టీమ్ షూటింగ్ విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది.

 


లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత తక్కువ మందితో సినిమా షూటింగ్ చేయాలని భావిస్తోందట. అలాగే షూటింగ్ ప్రాంతంలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారట. ప్రత్యేక అనుమతి తీసుకుని, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేయాలని అనుకుంటుందట. అయితే ఈ షూటింగ్ కి ముంబయి లో కాజల్ రాలేదు కాబట్టి ఆమెని కొన్ని రోజులు పక్కన పెడుతుందట. అంతా నార్మల్ అయ్యాక కాజల్ మీద ఉండే సన్నివేశాలని తెరకెక్కిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: