అల్లు అర్జున్. టాలీవుడ్లో టాప్ స్టార్ గా ఉన్నాడు. ఈ మధ్యనే హిట్ కొట్టాడు. అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్ మూవీగా సంక్రాంతికి వచ్చి జనాదరణను పొందింది. ఇక పుష్ప పేరిట సెన్షేషనల్ మూవీకి కూడా బన్నీ రెడీ అయిపోతున్నాడు. ఈ టైంలో టాలీవుడ్లో ఓ టాప్ గేమ్  మొదలైంది. 

 


బి ద రియల్ మ్యాన్ చాలెంజ్ కి  బన్నీకి దూరంగా ఉంచారా. ఈ అనుమానాలు ఇపుడు అందరిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఆయన్ని ఎవరూ నామినేట్ చేయకపోవడం విశేషం. డైరెక్టర్ సందీప్  వంగా మొదలెట్టిన ఈ చాలెంజి ఇపుడు అందరికీ పాకేసింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ సుకుమార్, రాజ మౌళి, రాం చరణ్, జూనియర్ ఎన్టీయార్ ఇలా అందరూ వంటింట్లో ఒక రోజు రాజు అయిపోయారు.

 

దీంతో ఈ వీడియోలకు ఎక్కడలేని లైక్స్ వచ్చిపడుతున్నాయి. ఇక టాప్ హీరోల్లో జూనియర్ విసిరిన ఈ చాలెంజిని  బాలయ్య, నాగార్జున  పూర్తి చేయాల్సి ఉంది. సరే ఇది అందరినీ దాటుకుంటూ వెళ్తున్నా అల్లు అర్జున్ పేరు ఎవరూ నామినేట్ చేయకపోవడం మాత్రం విశేషమే.  దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా దిగాలు పడుతున్నారుట. 

 

తమ హీరో కూడా ఇంటి పనులు, వంట పనులు చేసి వీడియో పెడితే చూడాలనుకుంటున్నారుట. కానీ బన్నీ ఈ చాలెంజిలో లేడే. ఆయనే కాదు, బాహుబలి ప్రభాస్ కూడా సైడ్ అయిపోయారు. ఆయన పేరుని కూడా ఎవరూ నామినేట్ చేయలేదు. మరి ఎందుకో తెలియదు కానీ బన్నీ నామినేట్ చేసేందుకు క్లోజ్ ఫ్రెండ్స్ సుకుమార్ లాంటి వారు ఉన్నా కూడా ఎందుకో చాలెంజిలో బన్నీ లేడంటే అది వింతే మరి. ఏది ఏమైనా బన్నీ లో కూడా రియల్ మాన్ ఉన్నాడు, ఆయన కూడా రేస్ కు రెడీ అవాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: