టాలీవుడ్ లో అభిమానులు స్టార్ హీరోల సినిమాల కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే పనులు మానుకుని కూడా ప్రేక్షకులు కొందరు స్టార్ హీరోల సినిమాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు హీరోలకు ఇమేజ్ ఎక్కువ కాబట్టి కొన్ని కొన్ని కాంబినేషన్ లను ప్రేక్షకులు ఎక్కువగా ఊహించుకునే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు ప్రేక్షకులకు వినోదం ఎక్కువగా కావాలి. ఈ నేపధ్యంలోనే దర్శకులు కూడా ఎప్పటికప్పుడు వారి కోసం కొత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన తెలుగులో అగ్ర హీరోలు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్. 

 

ప్రభాస్ జునుయర్ ఎన్టీఆర్ కాంబినేష లో సినిమా వస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మరి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది.. విలన్ గా ఎవరు నటిస్తే బాగుంటుంది అనేది చూస్తే... విలన్ గా ప్రభాస్ అయితేనే కథ బాగుంటుంది అంటున్నారు అభిమానులు. విలన్ గా ప్రభాస్ అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరో అయితే బాగుంటుందని కాని హైట్ పరంగా చూస్తే అంత ఫాస్ట్ గా ప్రేక్షకులు తట్టుకునే అవకాశం ఉండదు గాని దర్శకుడు రాజమౌళి అయితే మాత్రం బాగుంటుంది అని అంటున్నారు. 

 

వీరి కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు గాని ఎలా ఉంటే బాగుంటుంది అనేది చాలా మందికి అసలు అవగాహన లేదు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే అది కచ్చితంగా రాజమౌళి తీసుకొస్తే నే బాగుంటుంది అనేది కూడా చాలా మంది ఆలోచన. రాజమౌళి ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ముందు ఉంటారు కాబట్టి ఈ కాంబినేషన్ ని సెట్స్ మీదకు తీసుకుని రావాలని ప్రేక్షకులు కూడా కోరుతున్నారు. మరి  విలన్ గా అంటే ప్రభాస్ నటిస్తాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: