మెగాస్టార్ చిరంజీవి ఆటకావాలా పాటకావాలా సాంగ్ ఎంత ఫెమస్సో అందరికి తెలుసు. ఆ సాంగ్ ను ప్రోగ్రామ్ టైటిల్ గా పెట్టి జెమిని టివిలో ఒక అద్భుతమైన షో వచ్చింది. అప్పట్లో జెమిని టివి షోస్ చాల బాగుండేవి. ఉదయాన్నే నీకోసం అంతో బర్త్ డే విషెస్ అందించే ప్రోగ్రామ్ తో మొదలయ్యే జెమిని టివి ఎంటర్టైన్మెంట్ అలా రకరకాల షోలతో ఆడియెన్స్ ను అలరించేది. ఇక జెమిని టివి సూపర్ హిట్ షోలో ఒకటి ఆట కావాలా.. పాట కావాలా.. అనుపమ యాంకరింగ్ చేసే ఈ షో అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. సినిమా ప్రమోషనల్ ప్రోగ్రామ్ గా లైవ్ కాలర్స్ కోరుకునే ఈ షోని అనుపమ సక్సెస్ ఫుల్ గా నడిపించారు. 

 

అంతేకాదు డీయంతో పాటుగా కొత్త సినిమా గురు షోని కూడా హోస్ట్ చేశారు అనుపమ. జెమిని టివిలో అప్పట్లో అదరగొట్టిన ఈ యాంకర్ ఇప్పుడు అసలు కనిపించడమే మానేసింది. పెళ్లి తర్వాత పూర్తిగా బుల్లితెరకు దూరమైనా అనుపమ తమ యాంకరింగ్ తో ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది. హీరోయిన్ గా చేస్తుంటే పెళ్లి తర్వాత రిటైర్ అవ్వొచ్చు కానీ చేసేది యాంకరింగ్ కదా అయినా ఈమధ్య పెళ్లి తర్వాత హీరోయిన్స్ కూడా సినిమాలు చేస్తున్నారు. మరి అనుపమ ఎందుకు యాంకర్ గా చేయట్లేదో తెలియాల్సి ఉంది. 

 

ఆట కావాలా.. పాట కావాలా ఈ షోతో అనుపమ చాల పాపులారిటీ తెచ్చుకుంది. అయితే దశాబ్దం దాటినా సరే ఇప్పటికి ఆ షో ఆడియెన్స్ లో ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా స్మాల్ స్క్రీన్ కు దూరమైనా అనుపమ రీ ఎంట్రీ ఇస్తే బాగుటుందని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. అనుపమ రీ ఎంట్రీ ఉంటుందా.. ఉంటె ఆమె మళ్ళీ యాంకరింగ్ గా తన జోష్ కొనసాగిస్తుందా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: