పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా అంటే మరీ అంచనాలకు తగినట్టు లేకపోతే తప్ప సినిమా తప్పకుండా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఐతే సినిమా మొదటిరోజు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా సగం బడ్జెట్ కవర్ చేసే వసూళ్లు రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి. మిగతా హీరోల సినిమాలు ప్లాప్ అని తెలియగానే ఆడియెన్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించరు, కానీ పవర్ స్టార్ ప్లాప్ సినిమాలు కూడా మొదటిరోజు కలక్షన్స్ రికార్డులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. 

 

అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా ఈ మూవీ వస్తుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో మూవీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ డైరక్షన్ లో కూడా మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పవన్ సినిమా అంటే నిర్మాతలు క్యూ కట్టేస్తారు. కరెక్ట్ సినిమా పడితే పవర్ స్టార్ రేంజ్ ఏంటో ఆ సినిమా చేసే వసూళ్లను చూస్తే అర్ధమవుతుంది. అలాంటి సినిమా తీయాలని ప్రతి నిర్మాత అనుకుంటాడు. 

 

పవర్ స్టార్ తో సినిమా దర్శకులు కూడా అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తారు. పవన్ సినిమాల్లో ఎక్కువ డెబ్యూ డైరక్టర్స్ ఉంటారు. అయితే వారి మీద నమ్మకం ఉన్నా లేకున్నా నిర్మాతలు పవన్ చేస్తున్నాడు కాబట్టి డైరక్టర్ అడిగిన బడ్జెట్ ఇచ్చేస్తారు. సినిమా హిట్ అయితే దానికి డబుల్ ట్రిపుల్ అమౌంట్ వస్తాయి కాబట్టి నిర్మాతలు పవర్ స్టార్ డేట్స్ కోసం ప్రాకులాడుతారు. అయితే ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా చాల తక్కువ టైం లో ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నాడు పవన్, ఆ విధంగానే తన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ తో ఎవరైనా కొత్త నిర్మాత సినిమా చేయాలంటే మాత్రం మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: