ప్రస్తుతం రాను రాను టాలీవుడ్ హీరోల ఆలోచనల్లో కొంత మేర ఒకింత మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా బయట నిర్మాతల సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలు,ఇటీవల ఎవరికి వారు సొంతంగా నిర్మాణ సంస్థలు నెలకొల్పుతూ ఆయా బ్యానర్స్ పై సినిమాలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఆ విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, నితిన్, నాగ శౌర్య, పవన్ కళ్యాణ్, మనోజ్ వంటి వారు తమ ఓన్ బ్యానర్స్ పై సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.కాగా అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ని స్ధాపంచిన పవన్, ఆ బ్యానర్ పై సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసారు. 

 

అలానే మహేష్ బాబు కూడా శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు అలానే కళ్యాణ్ రామ్ అతనొక్కడే నుండి మొన్నటి కిక్, పటాస్ తో పాటు అతి త్వరలో తన తమ్ముడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాని తెరకెక్కించనున్నారు. అలానే మిగతా హీరోలు కూడా ఆ విధంగా కొనసాగుతున్నారు. గా వీరిలో కొందరు పలు ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి భాగస్వామ్యంతో సంయుక్తంగా సినిమాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ విధంగా హీరోలే సొంతంగా నిర్మాణ సంస్థలు నెలకొల్పడం ఒకరకంగా మంచిదే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

దానికి ప్రధాన కారణం సినిమాల యొక్క బడ్జెట్ అని, ఇలా చేయడం వలన తమ సినిమాల బడ్జెట్ పై ఆయా హీరోలకు కొంత అవగాహనా రావడంతో పాటు, సినిమా ఒకవేళ ఫ్లాప్ అయి నష్టాన్ని వారు కూడా కొంత భరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విధంగా సినిమాలు తీసి సక్సెస్ కొట్టిన సందర్భాల్లో మంచి లాభాలను కూడా సదరు హీరోలు చూసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అందుకే ఈ తరహా బిజినెస్ ప్రస్తుతం ఇటు తెలుగులో మాత్రమే కాక పలు ఇతర భాషల నటులు కూడా అనుసరిస్తున్నారని, అలానే రాబోయే రోజుల్లో మంచి పేరున్న హీరోయిన్లు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి, ఈ ట్రిక్ తో మంచి పేరు, డబ్బు సంపాదించే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: