పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగులు వేసుకున్నాడు. ఆయన తెర మీద పవర్ స్టారే. ఆయన వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టేశాడు. అయితే వాటిలో ముందుగా వకీల్ సాబ్ మూవీ రెడీ అవుతోంది. ఈ మూవీ ఇప్పటికి ఎనభై శాతం పూర్తి అయింది. కరోనా కనుక రాకపోతే, లాక్ డౌన్ లేకపోతే  ఈ పాటికి మూవీ  సమ్మర్ స్పెషల్ గా ధియేటర్లకు వచ్చి సందడి చేసేది.

 

అయితే ఇపుడు లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ ఎపుడు రీస్టార్ట్ అవుతుంది. ఎపుడు కంప్లీట్ అవుతుంది. మరెప్ప్పుడు ధియేటర్లకు వస్తుంది అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. సరే ఈ సినిమా సంగతి ఇలా ఉంటే పవన్ క్రిష్ సినిమా బాగా ఆసక్తిగా ఉంది. దాని అప్డేట్స్ మాత్రం కేక పుట్టిస్తున్నాయి. ఇది పాన్ ఇండియా మూవీగా తీస్తాన‌ని అంటున్నారు. అయితే ఈ మూవీలో పవన్ గెటప్ కూడా వెరైటీగా ఉంటుందని అంటున్నారు.

 

ఇది హిస్టారిక్ మూవీ అని, ఇంకా చెప్పాలంటే మొగలాయీల‌ కాలం నాటి మూవీ అని అంటున్నారు. ఈ మూవీలో మహమ్మద్ బీన్ తుగ్లక్ ప్రస్తావన ఉంటుందిట. ఆ కాలంలో మూవీ కాబట్టి తుగ్లక్ పరిపాలన గురించి కూడా బాగా వివరిస్తారని అంటున్నారు. తుగ్లక్ అంటూ ఇటీవల కాలంలో మళ్ళీ బాగా పొలిటికల్ గా వాడుతున్నారు. 

 

దాంతో ఈ మూవీలో తుగ్లక్ ని ఉద్దేశించి చేసే  పాత్ర, ఆ పాత్ర చుట్టూ తిరిగే ఇతర పాత్రలు. సెటైరకల్ డైలాగులు ఇవన్నీ కూడా ఉంటాయని అంటున్నారు. చూడబోతే ఇది హిస్టారికల్ మూవీ అయినా కూడా వర్తమాన రాజకీయాలను కూడా జొప్పించి డైలాగులు పేలుస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి.

 

పవన్ చూస్తే జనసేన అధినేత కూడానూ. దాంతో ఆయన మూవీస్ లోనే మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు. దాంతో ఇపుడు పవన్ క్రిష్ మూవీ మీద అందరి ద్రుష్టి  ఉంది. క్రిష్ కూడా కరెంట్ పాలిటిక్స్ మీద మంచి అవగాహన ఉన్న వారు కావడంతో  వీరిద్దరి మూవీ పొలిటికల్ డైనమైట్లు పేలుస్తుందని కూడా అంటున్నారు. చూడాలి ఇందులో ఎంతవరకూ నిజముందో. ఏది ఏమైనా ఈ మూవీ  వచ్చే ఏడాదే పట్టాలెక్కుతుంది. ఆ ఏడాది చివర్లో ధియేటర్లకు వస్తుంది అని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: