టాలీవుడ్ లో నాగార్జున కి ఉన్న క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసందే. అయితే ఆ క్రేజ్ మరింతగా పెరిగింది మాత్రం మన్మధుడు సినిమాతో. అప్పటి నుంచే నాగార్జున ని మన్మధుడు అని పిలవడం మొదలు పెట్టారు అక్కినేని ఫ్యాన్స్. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ రచన, విజయ్ భాస్కర్ డైరెక్షన్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధాన కారణమయ్యాయి. అప్పటి వరకు ఉన్న నాగార్జున క్రేజ్ ఈ సినిమాతో విపరీతంగా పెరిగింది. అంతేకాదు అమ్మాయిల నుండి మధ్య వయసు వాళ్ళ దాకా అందరికి నాగార్జున నవ మన్మధుడు అయ్యాడు. 

 

అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చి.ల.సౌ సినిమాని తెరకెక్కించిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాని నాగార్జున రాహుల్ రవీంద్రన్ కి అప్పగించడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయని ఆ మధ్య చెప్పుకున్నారు. అందులో ఒకటి సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద నాగార్జున కోడలు సమంత కి క్లోజ్ ఫ్రెడ్ అవడం..తన భర్త రాహుల్ రవీంద్రన్ కావడం ఒకటైతే చి.ల.సౌ సినిమా మేకింగ్ నాగార్జున కి బాగా నచ్చడం మరో కారణం. 

 

అంతేకాదు యంగ్ డైరెక్టర్ కావడంతో అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇక ఈ సినిమా మేయిన్ కథ కూడా పరభాషా కథ కావడం అది రాహుల్ స్వయంగా నాగార్జున కి చెప్పి మెస్మరైజ్ చేశాడు. ఇది నమ్మిన నాగార్జున గుడ్డిగా మన్మధుడు సృష్ఠించిన రికార్డ్ ని కూడా మర్చిపోయి రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా పెట్టి సినిమా నిర్మించి నటించాడు. అయితే ఈ సినిమా మీద ముందు నుంచి నెగిటివ్ టాక్ రావడం మొదలైంది. అందరికంటే ఎక్కువగా మాటలు పడింది నాగార్జున. వయసుతో సంబధం లేకుండా ఇలాంటి సినిమాలో నటించడమే కాదు మన్మధుడు పేరుని చెడగొట్టారని కామెంట్స్ చేశారు. అయితే దీనంతటికి కారణం మాత్రం రాహుల్ రవీంద్రన్ అని తర్వాత తెలుసుకున్నారట. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముండదు కదా..! 

మరింత సమాచారం తెలుసుకోండి: