తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవి రెండూ జీహెచ్ఎమ్ సీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం.

 

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 332 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 25 మంది మృతి చెందారు. సోమవారం 16 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రలో ప్రస్తుతం 646 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

 

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తాజా రిపోర్టు పై తీవ్రమైన హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఏపీలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు దడ పుట్టిస్తోంది. నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 1117కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం, అధికారుల్లో ఆందోళన పెరిగింది. 31 మంది మరణించారు. అయితే కరోనా పాజిటివ్ కేసుల ఎక్కువ శాతం యువతలో వస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిచింది.

 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించడానికి ఏప్రిల్ 29, 30 తేదీల్లో నరసరావుపేటలో పూర్తి లాక్ డౌన్ ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు.

 

దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి కరోనా లక్షణాలనే సంగతి తెలిసిందే. జాబితాలోకి మరికొన్ని లక్షణాలు వచ్చి చేరాయి. కండరాల నొప్పి, రుచి, వాసన శక్తిని కోల్పోవడం మొదలైన వాటిని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా లక్షణాల జాబితాలో చేర్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: