సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడంటే ఆ డైరెక్టర్ కి ఇక వరసగా అడ్వాన్సులు నిర్మాణ సంస్థలు లాక్ చేసుకుంటాయి. దాదాపు ఒక రెండేళ్ళ వరకు ఖాళీగా ఉండే అవకాశం ఉండదు. కాని ఇక్కడ ఎందుకనో ఈ డైరెక్టర్ కి సీన్ రివర్స్ అయింది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు అజ‌య్ భూప‌తి. మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 సినిమాని తెరకెక్కించే అవకాశం కోసం ఎంత కష్టపడ్డాడో చాలామందికి తెలీదనే చెప్పాలి. ఒక్క టైటిల్ కోసమే కొన్ని నెలలు శ్రమించాడు.

 

ఇక ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కి ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. కాని డైరెక్టర్ అజ‌య్ భూప‌తి మాత్రం తన రెండో సినిమా కోసం హీరోల చుట్టూ తెగ తిరిగాడు. ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఎంత తిరిగినప్పటికి అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. వరసగా 
ఈ హీరో.. ఆ హీరో.. ఒకే అయ్యారు. ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్ళడమే ఆలస్యం అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. కాని అఫీషియల్ గా మాత్రం ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించి సరైన సమాచారం లేదు. 

 

ప్రస్తుతానికి శర్వానంద్ హీరోగా సినిమా మొదలవబోతుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. అంతే కాదు ఈ సినిమాకోసం మరో హీరో కూడా ఫైనల్ అవుతాడని చెప్పుకొచ్చారు. ఇన్ని మారినప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి మారంది మాత్రం ఈ సినిమా టైటిల్ మహా సముద్రం. అయితే మొత్తానికి ఎలాగోలా లాక్ డౌన్ తరువాత అధికారికంగా ఈ సినిమాని ప్రకటించబోతున్నారని తాజా సమాచారం. మరి ఈసారైనా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయి సెట్స్ మీదకి వెళుతుందా లేదా చూడాలి. లేదంటే అజ‌య్ భూప‌తి కి కరోనా కష్ఠాలు తప్పవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: