టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటికి బోర్ కొట్టని కాంబినేషన్ లు కొన్ని ఉంటాయి. అందులో రంభ చిరంజీవి కాంబినేషన్ కూడా ఒకటి. రంభ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసే వారు. చిరంజీవి కెరీర్ లో మాస్ కి బాగా దగ్గర అయింది రంభ సినిమాలతోనే అని అంటూ ఉంటారు. హిట్లర్, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా... అల్లుడా మజాకా ఇద్దరు మిత్రులు, మృగరాజు సినిమాలు వచ్చాయి వీరి కాంబినేషన్ లో. ఈ సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయం సాధించాయి. 

 

బావ గారూ బాగున్నారా సినిమా అయితే ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకులను ఇప్పటికి అలరిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి రంభ నటన చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక హిట్లర్ సినిమాలో కూడా దాదాపుగా అంతే. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికి సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటాయి. అల్లుడా మజాకా సినిమా కూడా ఆగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. ఈ సినిమాలో ఉండే సన్నివేశాలు కూడా యుట్యూబ్ లో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. 

 

ఇక వీరి సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవి హీరోయిజం ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. దానితో పాటుగా రంభ తో ఆయన చేసిన పాటలు కూడా బాగా దగ్గర అయ్యాయి ప్రేక్షకులకు. ఆ పాటలు అన్ని కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటికీ ఆ పాటలు ఏదోక ఇంట్లో వినపడుతూనే ఉంటాయి. దర్శక నిర్మాతలకు కూడా ఈ కాంబినేషన్ ఎంతో ఇష్టమైన కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈ జంట ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిరంజీవి సినిమాలో ఆమె ఇప్పటికి నటించే అవకాశం ఉంది భార్యగా అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: