మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా ఆదరించడానికి మెగా అభిమానులు సిద్దంగా ఉంటారు. అభిమానుల ఆశలను నిలబెడుతూ నటనలో మెరుగులు దిద్దుకుంటూ మెగా హీరోలుగా రాణిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే మెగా వారసురాలిగా నిహారిక సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో వ్యక్తి ఎంట్రీ కోసం మెగా అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. అతడే అకీరా నందన్. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ - రేణు దేశాయ్ దంప‌తులకు ఇద్దరు పిల్లలు. వారే అకీరా నందన్ - ఆద్య. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తోంది. అకీరా నందన్ - ఆద్యలకి సంబంధించిన ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ ఉంటుంది. 

 

ఇప్పుడు తాజాగా ఆద్య యాక్ట్ చేసిన ఒక వీడియో పోస్ట్ చేసింది. డాక్టర్‌ ఆద్యగా.. పేషెంట్‌ ఆద్యగా ద్విపాత్రాభినయం చేసింది మెగా వారసురాలు ఆద్య. ఈ ఫన్నీ వీడియోకి రచన - డైరెక్షన్ - యాక్టింగ్ - ఎడిటింగ్ అంతా ఆద్యనే అంటూ ఇన్ స్టా‌గ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. 'ఐ హావ్ సమ్ బ్యాడ్ న్యూస్' మరియు 'ఐ హావ్ సమ్ రియల్లీ బ్యాడ్ న్యూస్' అంటూ చెప్పుకొచ్చింది ఆద్య. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. మెగా వారసుడు అఖిరా నందన్ వెండితెరపైకి రావడం లేటు కావొచ్చేమో కాని.. మెగా వారసురాలు ఆద్య మాత్రం ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అనిపిస్తోంది. ఇప్పటికే అకీరా నందన్ మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన 'ఇష్క్ వాలా లవ్' సినిమాలో అకీరా నటించిన విషయం తెలిసిందే. పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా ఆదరించడానికి మెగా అభిమానులు సిద్దంగా ఉంటారని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు అకీరాకి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

. Written. Acted. Directed. Edited. By Aadya my cutie pie😁😁😁

A post shared by renu desai (@renuudesai) on

మరింత సమాచారం తెలుసుకోండి: