టాలీవుడ్ లో అతి పెద్ద ఫ్యామిలీల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుండి ముందుగా అన్న ఎన్టీఆర్ గారి నటవారసుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ, మెల్లగా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నట సింహంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించారు. ఇక కెరీర్ పరంగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన బాలకృష్ణ అనంతరం ఆయన సోదరుడైన హరికృష్ణ చిన్న తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మొదట బాలరామాయణం సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆపై కొన్నేళ్ల తరువాత నిన్ను చూడాలని సినిమా ద్వారా హీరోగా మారడం జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎన్టీఆర్ కొనసాగుతున్నారు. 

 

ఇక ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ ముందుగా తొలిచూపులోనే సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తరువాత నుండి హీరోగా ప్రస్తుతం మంచి అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఇకపోతే ఈ ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశపడుతున్నారు. అయితే అది ఇప్పటివరకు కుదరలేదు .ఇక ఇటీవల ఒక పెద్ద దర్శకుడు ఈ ముగ్గురితో కలిసి సినిమా తీయనున్నారు అనే వార్త కూడా ఆ మధ్య హల్ చల్ చేయడం జరిగింది. 

 

కాగా ఆ తరువాత దానిపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ కొందరు నిరాశ చెందారు. అయితే ఈ ముగ్గురిని ఒకే తాటిపైకి తెచ్చి సినిమా చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత కష్టం అని, ఎందుకంటే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ తో ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉండగా,  బోయపాటి సినిమాతో బాలకృష్ణ, అలానే తన లేటెస్ట్ మూవీ తో కళ్యాణ్ రామ్ పూర్తిగా బిజీ బిజీ గా ఉన్నారని, అలానే రాబోయే మరికొద్దిరోజుల్లో ఈ ముగ్గురూ కూడా మరొక రెండు సినిమాలను లైన్లో పెట్టె అవకాశం ఉందని, కాబట్టి ఇప్పట్లో వీరి కలయికలో సినిమా రావడం కష్టమే అని తెలుస్తోంది. మరి అభిమానులు కోరుతున్నట్లు ఈ ముగ్గురు హీరోలు కలిసి ఎప్పుడు నటిస్తారో, వారికి ఆ పండుగ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: